ఎప్పుడూ చిరునవ్వుతోనే.. గుండె ముక్కలైంది.. జన్మలో మాట్లాడను.. విషాదంలో దేవీ శ్రీ ప్రసాద్, బిగ్‌బీ

ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతితో బాలీవుడ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున వాజిద్ ఖాన్ ఇక లేరనే వార్త హిందీ సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. వాజిద్ మరణ వార్తను ఆయన సన్నిహితులు జీర్ణించుకోలేకపోయారు. ఆయనతో ఉన్న అనుభూతులు, అనుభవాలను ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. వాజిద్ మరణవాతర్తపై దేవీ శ్రీ ప్రసాద్, అమితాబ్, ప్రియాంక చోప్రా తదితరులు స్పందిస్తూ..

వాజిద్ మరణవార్తతో విషాదంలో.. దేవీ శ్రీ ప్రసాద్

వాజిద్ మరణవార్తతో విషాదంలో.. దేవీ శ్రీ ప్రసాద్

వాజిద్ భాయ్ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. నిద్రలేవగానే ఆ వార్తతో ఒక్కసారిగా షాక్ తిన్నాను. చాలా త్వరగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. భగవంతుడు వాజిద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ఏ లోకాన ఉన్న ఆత్మకు శాంతి చేకూరాలి అని సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

Recommended Video

Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19
 షాక్ తిన్నాను.. బిగ్ బీ

షాక్ తిన్నాను.. బిగ్ బీ

మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ మరణవార్తతో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ షాక్ గురయ్యారు. దిగ్బ్రాంతి నుంచి తేరుకొని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. వాజిద్ ఖాన్ ఈ లోకం నుంచి వెళ్లిపోయారనే వార్త నాకు షాక్ గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను అని బిగ్ బీ ట్వీట్ చేశారు.

ఎప్పుడూ చిరునవ్వుతోనే..

ఎప్పుడూ చిరునవ్వుతోనే..

లాస్ ఎంజెలెస్‌లో స్వీయ గృహనిర్బంధంలో ఉన్న ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అత్యంత విషాదకరమైన వార్త. వాజిద్ భాయ్ పేరు వింటే ఆయన ముఖం మీద కదలాడే చిరునవ్వు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు నవ్వుతూనే ఉంటారు. నా స్నేహితుడి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని ప్రియాంక చోప్రా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు.

నీతో ఇక మాట్లాడను.. విశాల్ దల్దానీ

నీతో ఇక మాట్లాడను.. విశాల్ దల్దానీ

వాజిద్ ఖాన్ మరణవార్తతో నా గుండె ముక్కలైనంత పనైంది. నాకు వాజిద్, సాజిద్ ఇద్దరు క్లోజ్, నిజమైన స్నేహితులు. మా స్టూడియోలో సరదాగా మాట్లాడుకొనేందుకు, నవ్వుకొనేందుకు అర్ధరాత్రి కలిసే క్షణాలు నాకు గుర్తుస్తున్నాయి. వాజిద్ నువ్వు చేసిన పనికి ఇక ఈ జన్మలో నీతో మాట్లాడను అని విశాల్ దల్దానీ ట్వీట్ చేశారు.

సినీ ప్రపంచం ఉన్నంత వరకు.. కరణ్

సినీ ప్రపంచం ఉన్నంత వరకు.. కరణ్

వాజిద్ ఖాన్‌కు నా ప్రగాఢ సంతాపం. సినీ ప్రపంచం ఉన్నంత వరకు నీ మ్యూజిక్ ఉంటుంది. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నా సంతాపం. ఇంత త్వరగా ఈ లోకం నుంచి వెళ్లిపోతావని ఊహించలేదు మిత్రమా అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.

ఇంత త్వరగా ఈ లోకం నుంచి.. ఫరా ఖాన్

ఇంత త్వరగా ఈ లోకం నుంచి.. ఫరా ఖాన్

వాజిద్ ఖాన్ మరణవార్తను ఊహించలేదు. ఇంత తర్వగా ఈ లోకం నుంచి నిష్క్రమిస్తావని అనుకోలేదు. అద్భుతమైన మ్యూజిక్‌తో మా హృదయంలో స్థానం సంపాదించుకొన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటాను అని ఫరా ఖాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

నా సోదరుడిని కోల్పోయాను.. అద్నానీ సమీ

వాజిద్ మరణవార్తతో ఒక్కసారిగా షాక్ తగిలింది. నా సోదరుడిని కోల్పోయాననే విషాదంలో మునిగిపోయాను. ఈ విషాదం నుంచి బయట పడటం చాలా కష్టమే. అద్భుతమైన మనసు ఉన్న వ్యక్తి. భగవంతుడా దయచేసి దయచూపండి అని అద్నానీ సమీ ట్వీట్ చేశారు.

విషాదంలో మునిగిపోయాను..

వాజిద్ ఆకస్మిక మరణవార్త నన్ను కలిచివేసింది. ఆ వార్తతో విషాదంలో మునిగిపోయాను. వాజిద్‌తో అనుభూతులు మా హృదయాల్లో ఎప్పుడూ నిలిచిపోతాయి. వాజిద్ లేరనే వార్త చాలా బాధను కలిగిస్తున్నది. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని వేడుకొంటున్నాను అని ఆర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X