సెలబ్రిటీస్ రివ్యూ: శ్రీదేవి కూతురు జాహ్నవి ‘ధడక్’ మూవీ ఎలా ఉందంటే?
శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ ఇందులో హీరోగా నటించాడు. మరాఠీ హిట్ మూవీ 'సైరాట్' రీమేక్‌గా శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఇటీవల ధడక్ స్పెషల్ షో ప్రదర్శించారు. సోనమ్ కపూర్, అనిల్ కపూర్‌తో పాటు కరణ్ జోహార్, అనన్య పాండే, వరుణ్ ధావన్ సినిమా చూసి ప్రశంసించారు. తొలి సినిమా అయినా జాహ్నవి, ఇషాన్ అద్భుతంగా నటించారంటూ పొగడ్తలు గుప్పించారు.

మీ మదిని దోచేస్తుంది: అనిల్ కపూర్
‘ధడక్' మూవీ చూసిన అనంతరం అనిల్ కపూర్ ట్వీట్ చేస్తూ ‘ జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ ఆల్రెడీ స్టార్స్ అయ్యారు. తెరపై వారి ఇన్నోసెన్స్&లవ్ మీ మదిని దోచుకుంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా ఇది' అని ట్వీట్ చేశారు.

తెరంగ్రేటం అదిరిపోయింది: సోనమ్ కపూర్
జాహ్నవి కపూర్ సోదరి సోనమ్ కపూర్ స్పందిస్తూ... ‘జాహ్నవి తెరంగ్రేటం అదిరిపోయింది. చాలా గర్వంగా ఉంది. ఇషాన్ ఖట్టర్ ఆకట్టుకున్నాడు. వీరిని ఇంత బాగా తెరపై చూపించిన దర్శకుడు శశాంక్ ఖైతాన్‌కు థాంక్స్. స్క్రీన్ మీద ఈ జంటను చూసే ప్రేక్షకుడు స్టన్నవుతాడు' అంటూ ట్వీట్ చేసింది.

ఎక్సలెంట్ ఫిల్మ్ : సంజయ్ కపూర్
సంజయ్ కపూర్ రియాక్ట్ అవుతూ... ఎక్సలెంట్ ఫిల్మ్, జాహ్నవి తెరంగ్రేటం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఇషాన్ ఖట్టర్ ఫెంటాస్టిక్ యాక్టర్. శశాంక్ ఖైతాన్ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు చాలా బావుంది. కరణ్ జోహార్ మంచి విజన్ ఉన్న నిర్మాత అని ట్వీట్ చేశారు.

శ్రీదేవి వారసురాలు
అతిలోక సుందరిగా కీర్తికెక్కిన శ్రీదేవి నుండి అందాన్ని పునికి పుచ్చుకుందని ఇప్పటికే ప్రశంసలు అందుకున్న జాహ్నవి... తల్లి నుండి నట వారసత్వాన్ని ఏమేరకు అందిపుచ్చుకుంది? అనేది జులై 20న ప్రేక్షకులు తేల్చనున్నారు.

అంచనాలు పెంచిన ట్రైలర్
శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కరణ్ జోహార్ నిర్మాత. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముంబై, కోల్‌కతా బ్యాక్‌డ్రాపులో ఈ చిత్రం సాగుతుంది.


Click it and Unblock the Notifications











