రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్‌పై రాళ్లదాడి.. సెక్యూరిటీ సిబ్భందిని తరిమికొట్టి...
బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహం నిర్మించి నటిస్తున్న ఎటాక్ చిత్ర షూటింగు నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సినిమాకు యాక్షన్ సీన్ల షూటింగు ధనిపూర్‌లో జరుగుతున్నది. అయితే ఈ సందర్భంగా జరిగిన సంఘటన ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటంటే...

జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ జంటగా
ఎటాక్ సినిమా విషయానికి వస్తే .. జాన్ అబ్రహం నిర్మిస్తున్న చిత్రానికి లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహంతోపాటు జాక్వలైన్ ఫెర్నాండేజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 13వ తేదీన రిలీజ్ కానున్నది.

జాన్ అబ్రహంపై యాక్షన్ సీన్లు
అయితే ఎటాక్ సినిమా షూటింగు ధనీపూర్ ఎయిర్ స్ట్రిప్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చేస్తున్నారు. ఈ షూటింగులో భాగంగా జాన్ అబ్రహం బైక్‌పై స్టంట్లను ప్రదర్శిస్తూ షూటింగులో పాల్గొన్నారు. ఈ షూటింగుకు భారీ స్థానికులు తరలివచ్చారు. ఈ క్రమంలో బాంబ్ బ్లాస్టులను చూసి ప్రజలు థ్రిల్ అయ్యారు. అయితే ఆదివారం జరిగిన షూటింగులో ఊహించని పరిణామాలు చోటుచేసుకొన్నాయి.

భారీగా స్థానికులు తరలిరావడంతో
ఎటాక్ షూటింగు సమయంలో సెట్‌కు సంబంధించిన మెయిన్ గేట్‌ను మూసివేశారు. యాక్షన్ సీన్ల సందర్భంగా దెబ్బలు, గాయాలు తగలకూడదనే విధంగా యూనిట్ జాగ్రత్తలు తీసుకొన్నారు. అయితే ఎక్కువ సంఖ్యంలో ప్రజలు సెట్ గోడ ఎక్కి షూటింగు చూడటానికి ఎగబడ్డారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకొన్నారు.

పోలీసుల జోక్యంతో గొడవ
షూటింగ్ వద్ద సెక్యూరిటీ సిబ్బందికి, స్థానికులకు మాట మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దాంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. అయితే తమను అడ్డుకొన్న సెక్యూరిటీ సిబ్బందిపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. దాంతో షూటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్బంగా రకుల్ ప్రీత్ సింగ్ షూటింగులో లేరనే విషయం తెలిసింది.


Click it and Unblock the Notifications











