అక్టోబర్ లో అతరింగీ రే షూటింగ్... సారాతో ధనుష్ రొమాన్స్
బాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తించిన అపూర్వ కలయిక మళ్లీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతంది. అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్ నటిస్తున్న అతరంగీ రే చిత్రం షూటింగ్ ను అక్టోబర్ నుంచి పునః ప్రారంభించాలని దర్శక-నిర్మాతలు భావిస్తున్నారు.
లాక్ డౌన్ ను క్రమక్రమంగా ఎత్తివేస్తుండటంతో సినీ జనాలు కూడా షూటింగ్ లపై దృష్టిసారిస్తుండగా, బాలీవుడ్ కిలాడీ కుమార్ మాత్రం ప్రాజెక్ట్ లను పరుగులు పెట్టించిన యోచలో ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆగస్టులో బెల్ బాటమ్ సూటింగ్ మొదలుపెట్టనున్న అక్షయ్, ఇందుకోసం లండన్ వెళ్లనున్నాడు. తిరిగి వచ్చాక అక్టోబర్ లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అతరింగీ రే షూటింగ్ లో పాలుపంచుకోనున్నాడు.

అతరింగీ రే సినిమాలో సారా అలీఖాన్, ధనుష్ జంటగా నటిస్తుండగా, అక్షయ్ కుమార్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. అక్టోబర్ నుంచి మూడు నెలల పాటూ ముంబై, మధురై, ఢిల్లీలో చిత్రీకరించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రత మధ్య షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత్ ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించబోతున్నాడు. మరి ధనుష్, సారాల జోడీ ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











