Dharmendra: ధర్మేంద్ర ఆవేశం.. షూటింగ్‌లో ఒరిజినల్ బుల్లెట్‌తో అమితాబ్‌కి గురి.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మంద్ర తీవ్ర అస్వస్థతకు గురై ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ధర్మేంద్ర మరణించినట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. అయితే ఈ కథనాలను ధర్మంద్ర కుమార్తె ఈషా డియోల్ ఖండించారు. నాన్నగారు బాగానే ఉన్నారని.. ఆయనకు చికిత్స కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. ధర్మేంద్ర ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన గత విషయాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ధర్మేంద్ర - అమితాబ్‌లకు సంబంధించిన ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఆల్‌టైం క్లాసిక్‌గా షోలే
బాలీవుడ్‌తో పాటు భారతీయ సినిమా గర్వంగా చెప్పుకునే ఆల్‌టైం క్లాసిక్స్‌లో షోలే కూడా ఒకటి. ఈ ఏడాది ఆగస్ట్ 15తో షోలే విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఐదు దశాబ్ధాలు గడుస్తున్నా ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారంటే షోలే వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. బీభత్సం, భయానకం, హీరోయిజం, స్నేహం ఇలా అన్ని రకాల అంశాలు మేళవించి భారతీయ సినిమాను కొత్తదారుల్లో కదం తొక్కించింది షోలే. భారతీయ చిత్ర పరిశ్రమను షోలేకు ముందు, ఆ తర్వాత సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారంటే ఈ సినిమా గురించి అర్ధం చేసుకోవచ్చు. 1975 ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

దిగ్గజాలంతా ఓకే ఫ్రేమ్‌లో
నటీనటులు, రచయితలు, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌కి డిక్షనరీగా అనదగ్గ సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో మాస్టర్ పీస్ షోలే. ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, హేమామాలిని, అమితాబ్ బచ్చన్, జయబాధురి, అమ్జాజ్ ఖాన్, ఏకే హంగల్, సత్యన్ కప్పు, లీలా మిశ్రా, వికాస్ ఆనంద్, మెక్ మోహన్ వంటి లెజండరీ నటులు ఈ చిత్రంలో నటించారు. ఆ నాటి భారతీయ సమాజంలోని వాస్తవ పరిస్ధితుల్ని, గ్రామాల్లోని వాతావరణానికి తగినట్లుగా సలీం - జావెద్‌లు షోలే స్క్రిప్ట్ రెడీ చేశారు.
షోలేకు రికార్డుల వర్షం
యూనైటెడ్ ప్రొడ్యూసర్స్, సిప్పి ఫిలింస్ బ్యానర్‌పై జీపీ సిప్పీ ఈ సినిమాను నిర్మించగా.. ఆయన తనయుడు రమేశ్ సిప్పీ దర్శకత్వం వహించగా.. ఆర్డీ బర్మన్ సంగీత దర్శకత్వం వహించారు. 30 మిలియన్ల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం 350 మిలియన్ రూపాయలను వసూలు చేసింది. రీ రిలీజ్‌లోనూ వసూళ్ల వర్షం కురిపించగా.. ప్రపంచవ్యాప్తంగా షోలే సినిమా టికెట్లు 250 మిలియన్ల మేర అమ్ముడయ్యాయి. 70 ఎంఎం వైడ్ స్క్రీన్ ఫార్మాట్‌లో స్టీరియో ఫోనిక్ సౌండ్ ట్రాక్‌లో తీసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా షోలే నిలిచింది. అలాగే 100 థియేటర్స్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
అమితాబ్‌కి గురిపెట్టిన ధర్మేంద్ర
జై- వీరూలుగా అమితాబ్, ధర్మేంద్రలు స్నేహితులుగా నటించారు. గొప్ప స్నేహం గురించి చెప్పాల్సి వస్తే షోలేలో జై- వీరూలా ఉండాలని ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్‌కి పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని రామ్ నగర వద్ద షోలో షూటింగ్ జరిగింది. ఓ రోజున సీన్‌లో భాగంగా కొండ మీద అమితాబ్ నిలబడి ఉంటే.. రాళ్ల గుట్టల కింద ధర్మేంద్ర నిలబడ్డారు. పెట్టెలోంచి గన్‌లు, బుల్లెట్లు తీసి కంగారు కంగారుగా తీసి పై వైపుకి ధర్మేంద్ర తుపాకీ కాల్చాలి. అయితే అప్పటికే వీరూ తాగి ఉండటంతో రెండు మూడు సార్లు టేకులు తీసుకున్నా షాట్ ఓకే కాలేదు. దీంతో చిరాకుతో, అసహనంతో ఉన్న ధర్మేంద్ర పొరపాటున పక్కనే ఉన్న ఒరిజినల్ బుల్లెట్స్ తీసి కాల్పులు జరిపాడు. దాంతో తూటా అమితాబ్ చెవి పక్క నుంచి రాసుకుంటూ వెళ్లింది. అమితాబ్ ఆ సమయంలో ఏమాత్రం పక్కకి జరిగినా ఆయన ప్రాణాలు గాల్లో కలిసిపోయావి. ఈ సంఘటనతో చిత్ర బృందం షాక్ కావడంతో పాటు షూటింగ్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు. 2020లో జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో అమితాబ్ బచ్చన్ ఈ విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











