స్టార్ హీరోయిన్ తో సూపర్ స్టార్ రెండో పెళ్లి.. సవతి తల్లిపై యంగ్ హీరో కత్తితో ఎటాక్
సినిమాల్లో అగ్ర కథానాయికలుగా వెలుగొందిన చాలా మంది హీరోయిన్లు తమ పెళ్లి విషయంలో మాత్రం ఎందుకో తప్పటడుగులు వేస్తారన్న అపవాదు ఉంది. వారిని పెళ్లాడటానికి కోటీశ్వరులు, అందగాళ్లు క్యూకడుతుంటే.. సదరు భామలు మాత్రం ఆల్రెడీ పెళ్లయి పిల్లలు ఉన్న వ్యక్తులను ఇష్టపడుతుంటారు. ప్రేమ ఎప్పుడు , ఎవరిపై , ఎందుకు కలుగుతుందో చెప్పలేం మరి. ఉత్తరాదిలో ఈ కల్చర్ తారాస్థాయిలో ఉంటే దక్షిణాదిలోనూ వ్యాపించింది. మహానటి సావిత్రితో మొదలుకుని నయనతార వరకు సెకండ్ హ్యాండ్ హజ్బెండ్స్‌ను ఇష్టపడ్డారు.
సావిత్ర అప్పటికే పెళ్లయిన జెమినీ గణేషన్‌తో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. యావత్ భారతదేశాన్ని తన నటన, అందంతో ఉర్రూతలూగించిన శ్రీదేవి అప్పటికే పెళ్లయి, పిల్లలున్న బోనీ కపూర్‌ను పెళ్లాడారు. తమిళ నటి రాధిక సైతం అప్పటికే పెళ్లయి పిల్లలున్న శరత్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటే సెకండ్ హ్యాండ్ భర్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్ టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో చాలా పెద్దది.

ఈ కోవలోకే వస్తారు హేమామాలిని. 1970-80 దశకాల్లో బాలీవుడ్‌ను అన అందం, అభినయం, నృత్యంతో ఏలారు హేమ. అందమైన రూపం, కలువల్లా కన్నులు, పండు వెన్నెల లాంటి చిరునవ్వుతో నాటి తరం కుర్రాళ్లకు డ్రీమ్‌గర్ల్‌గా వారికి నిద్రలేని రాత్రులను మిగిల్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. భారతీయ చిత్ర పరిశ్రమలోని ఆల్‌టైమ్ గ్రేట్ నటీమణుల్లో ఒకరిగా నిలిచారు.
80కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరని అందం, అదే ఎనర్జీతో కుర్రకారుకు సైతం పోటీనిస్తున్నారు హేమామాలిని. ఆరు దశాబ్ధాల సినీ జీవితంలో వందలాది చిత్రాల్లో నటించడంతో పాటు దర్శకురాలిగా, నృత్యకారిణిగానూ ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హేమామాలిని బీజేపీలో చేరారు. తొలుత రాజ్యసభ సభ్యురాలిగా విధులు నిర్వర్తించిన ఆమె.. 2014లో మథుర నుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి 2019, 2024 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు.

అయితే పైన చెప్పిన విధంగానే హేమమాలిని సైతం సెకండ్ హ్యాండ్ మొగుణ్ణే ఎంచుకున్నారు. బాలీవుడ్ హీమెన్ ధర్మేంద్రను పెళ్లాడారు. అప్పటికే ఆయనకు ప్రకాష్ కౌర్‌తో వివాహమై నలుగురు పిల్లలుండగా.. వారిలో పెళ్లీడుకొచ్చిన వారూ ఉన్నారు. అయినప్పటికీ ధర్మేంద్రతో ప్రేమలో పడటం, ఆయనను పెళ్లాడటం జరిగిపోయింది. అయితే ఈ వివాహం ధర్మేంద్ర కుమారుడు , హీరో సన్నీడియోల్‌కు ఇష్టం లేదని ఈ క్రమంలోనే హేమమాలినిపై కత్తితో దాడి చేశాడని బీటౌన్‌లో చెప్పుకుంటూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టారు ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్. స్టార్ డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సన్నీకి 24 ఏళ్లు ఉన్నప్పుడు తన భర్త మరో మహిళను పెళ్లాడారని తెలిపారు. ప్రతి పిల్లవాడు తన తల్లిదండ్రులను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడని.. కానీ తన తండ్రిని మరో స్త్రీ ప్రేమిస్తుంటే దాడి చేస్తాడని అర్ధం కాదన్నారు. తాను బాగా చదువుకోలేదని, కానీ తన పిల్లలు మాత్రం ఈ ప్రపంచంలో తానే అత్యంత అందమైన మహిళనని నమ్ముతారని ప్రకాష్ కౌర్ పేర్కొన్నారు. తాను పిల్లలను క్రమశిక్షణతో , మంచి మర్యాదలతో పెంచానని.. వారు ఎదుటి వ్యక్తిని ఎన్నడూ బాధపెట్టే పని చేయరని ఆమె తేల్చిచెప్పారు.


Click it and Unblock the Notifications











