Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేశ్ హీరోయిన్‌కు బ్రేకప్ చెప్పి.. సుమంత్ లవర్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన హీరో
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. గతంలో ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ 'ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీ' వచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నో భారీ సినిమాలో అవకాశాలు దక్కించుకోవడంతో బాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇప్పుడు ఇదే స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
మొదట కృతి సనన్‌తో..
ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే' ఫేం కృతి సనన్‌తో డేటింగ్ నడిపి బీ టౌన్లో హాట్ టాపిక్ అయ్యాడు. వీళ్లిద్దరూ తరచూ సీక్రెట్‌గా కలవడం.. కెమెరాల కంటికి చిక్కడంతో బాలీవుడ్లో వీళ్ల గురించే తరచూ చర్చలు జరిగేవి. అంతేకాదు, ఒకానొక సందర్భంలో తామిద్దరం డేటింగ్లో ఉన్నామంటూ ఈ జంట బహిరంగంగానే చెప్పుకొచ్చింది.
క్లారిటీ ఇచ్చిన సనన్
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో రిలేషన్ గురించి కూడా ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. 2016 నుంచి తమ గురించి ఇలాంటి న్యూస్ వస్తుందని.. పట్టించుకోవడం మానేసి తన పని తాను చేసుకుంటున్నానని చెబుతుంది ఈ భామ. మొత్తానికి కృతి సనన్ మాటలతో ఆమెకు లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటే నమ్మకం లేదని అర్థమైపోతుంది. ఈ స్టేట్మెంట్ తర్వాత సుశాంత్‌కు ఆమె బ్రేకప్ చెప్పడం విశేషం.
|
ఇప్పుడు మరొకరి ప్రేమలో ధోని
ప్రముక నిర్మాత కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘తూనీగా తూనీగా' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రెహా చక్రవర్తితో ప్రస్తుతం సుశాంత్ ప్రేమాయణం నడుపుతున్నాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఈ మధ్యనే బౌద్ద మతం పుచ్చుకున్న ఈ హాట్ లేడీతో అతడు చట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడంతో ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.
మరిచిపోలేని గిఫ్ట్
రెహా చక్రవర్తితో సుశాంత్ డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో వార్త బీ టౌన్లో సంచలనం అవుతోంది. ఇటీవల ఈ జంట లడక్ టూర్ వెళ్లిందని, అక్కడ బాగా ఎంజాయ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, జూలై 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా సుశాంత్ డైమండ్ పెండెంట్ ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతేకాదు, ఆరోజున సుశాంతే ఆమెతో కేక్ కట్ చేయించాడన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.