Dhurandhar 2: ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. రణ్‌వీర్‌తో దీపిక కలిసి..

Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్'(Dhurandhar 2)బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తుంది. ఎవ్వరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొదటి భాగం సృష్టించిన రికార్డులను మించిపోయేలా ఈ సీక్వెల్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యాక్షన్, స్పై థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఊహించని ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 700 కోట్లు వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద 'హౌస్‌ఫుల్' బోర్డులు కనిపిస్తుండగా, ఇది రణవీర్ సింగ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది.

ఈ భారీ విజయంతో బాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలే కాకుండా ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ధురంధర్ మూవీ యూనిట్ అభినందించారు. ఆ సినిమా రేంజ్ ను మరింత పెంచేశారు. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకు ఊహించని స్పందన వస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ వీకెండ్ లో (గల్ప్) మినహా దాదాపు రూ. 200 కోట్ల వరకు వసూళ్లు సాధించి, నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి, సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది.

Dhurandhar 2 Rumours End as Deepika Padukone Joins Ranveer Singh Amid Massive Box Office Success

ఇలా ఊహించని విజయాన్ని అందుకున్న తరుణంలో ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమా విజయం గురించి వెంటనే సోషల్ మీడియాలో స్పందించకపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా భర్త విజయాలపై వెంటనే స్పందించే దీపికా ఈసారి మౌనం పాటించడం, ముంబైలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు కాకపోవడం, తదుపరి రోజు కుటుంబంతో ఇతర కార్యక్రమాల్లో కనిపించడం అన్ని కలిసి పుకార్లకు దారితీశాయి. వీరిద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అన్న సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే ఈ రూమర్లకు చాలా త్వరగా క్లారిటీ వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద రణవీర్-దీపికా జంట కలిసి కనిపించారు. ఈ పవర్ కపుల్‌ను చూసేందుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. రణవీర్ బయటకు రాగానే 'బబ్బర్ షేర్' అంటూ నినాదాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా రణవీర్‌కు లభించిన అభిమానుల ప్రేమను చూసి దీపికా ఎంతో ఆనందంగా కనిపించారు. ముఖ్యంగా ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు చూస్తే.. తన భర్త సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ధురంధర్ గురించి పోస్టులు పెట్టకపోయినా, ప్రత్యక్షంగా కలిసి కనిపించడం ద్వారా విభేదాలు అనే రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. అభిమానుల కేరింతల మధ్య ఈ జంట ఎంతో హ్యాపీగా కనిపించడం, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పింది. ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 'ధురంధర్ 2' ఈ వేగం కొనసాగితే త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ భారీ వసూళ్లు సాధిస్తూ గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా దూసుకుపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X