Dhurandhar: The Revenge Teaser Review: ధురంధర్: ది రివెంజ్ టీజర్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం ధురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం ధురంధర్ ది రివెంజ్ మూవీ మార్చి 19వ తేదీన మరోసారి సెన్సషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ ఎలా ఉంది.. ఈ టీజర్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

దురంధర్ ది రివేంజ్ సినిమా విషయానికి వస్తే.. రాబోయే ఈ చిత్రంలో జస్కిరాత్ సింగ్ రాంగీ పాత్ర కోణంలో సాగుతుంది అనే విషయం స్పష్టంగా టీజర్‌లో కనిపించింది. జస్కిరాత్ సింగ్ ఎందుకు హమ్జా ఆలీ మజారీగా మారాడనే ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానం చెప్పేలా టీజర్‌ను దర్శకుడు ఆదిత్య ధార్ డిజైన్ చేశాడు. జస్కిరాత్ సింగ్ గతంలో ఏం జరిగింది? కరాచీపై యుద్ధం చేయడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండటానికి కారణమేమిటనేది ప్రేక్షకులను ఓ ప్రశ్న వెంటాడుతున్నది. ఆ ప్రశ్నకు, మరికొన్ని ప్రశ్నలకు జవాబు వెతుక్కొనే విధంగా ఈ టీజర్‌ను రూపొందించారనేది క్లియర్ కట్‌గా కనిపించింది.
రెహ్మాన్ డెకాయిట్ డామినేషన్ తగ్గిన తర్వాత కరాచీని హమ్జా ఆలీ మజారీ ఎలా హస్తగతం చేసుకొన్నాడు? కరాచీ, ఇతర ప్రాంతాల్లో ఆయుధ విక్రయాల మాఫియాను, ఐఎస్ఐ గ్రూపులను ఎలా దెబ్బ తీశాడు. కరాచీ సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో ఎలా కంట్రోల్ చేశాడు అనే విధంగా రణ్‌వీర్ సింగ్ పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసినట్టు టీజర్‌లో కనిపించింది. ఇక ఈ టీజర్‌లో యలీనా జమాలీ (సారా అర్జున్) పాత్రను కనిపించకుండా దాచి పెట్టారు. ఎస్పీ చౌదరీ (సంజయ్ దత్), అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) పాత్రలు కీలకంగా కనిపించబోతున్నాయి.
దురంధర్ ది రివేంజ్ టీజర్‌లో డైలాగ్స్‌కు పెద్దగా స్కోప్ ఇవ్వకుండా కేవలం విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విషయంపైనే దృష్టిపెట్టారు. చివర్లో ఇది నూతన భారతదేశం. సరిహద్దులు దాటి చొరబడుతుంది. దెబ్బ కొట్టి తీరుతుంది అంటూ రణ్‌వీర్ సింగ్ చేత డైలాగ్స్ చెప్పి.. అంచనాలు పెంచారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకొంటుందో మార్చి 19వ తేదీ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











