సెక్సువల్ మిస్‌కండక్ట్: రాజ్ కుమార్ హిరానీ ఇష్యూపై స్పందించిన దియా మీర్జా!
బాలీవుడ్ టాప్ డైరెక్టర్... మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియట్స్, పికె, సంజు లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రఖ్యాత దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మరోసారి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో #మీటూ మూమెంట్ హాట్ టాపిక్ అయింది.
'సంజు' సినిమాకు పని చేస్తున్న సమయంలో హిరానీ తనను ఆరు నెలల పాటు లైంగికంగా వేధించాడంటూ అతడి వద్ద అసిస్టెంటుగా పని చేసిన మహిళ ఆరోపించిన విషయం హాఫ్ పోస్ట్ అనే ఇంటర్నేషనల్ వెబ్ సైట్ బయట పెట్టింది. ఇండస్ట్రీలో ఎంతో మంచి వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరున్న దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా షాకయ్యారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నటి దియా మీర్జా స్పందించారు.

నన్ను తీవ్రంగా బాధించింది
రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ‘సంజు' చిత్రంలో మాన్యతా దత్ పాత్ర పోషించిన దియా మీర్జా స్పందిస్తూ.... హిరానీ మీద ఇలాంటి ఆరోపణలు రావడం బాధించిందని తెలిపారు. 15 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.. ఇలాంటి వార్తలు రావడంతో షాకయినట్లు వెల్లడించారు.

అఫీషియల్ ఎంక్వయిరీ జరిపించాలి
ఈ ఆరోపణలపై అఫీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని కోరుకుంటున్నాను. అపుడే అసలు నిజం బయటకు వస్తుంది. నేను ఆయనతో పని చేశాను... నాకు తెలిసినంత వరకు ఆయన చాలా మంచి వ్యక్తి. అయితే ఈ ఆరోపణలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదని ఆమె అన్నారు.

రెండు నెలల ముందే హిరానీ దృష్టికి
తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుమార్ హిరానీ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదన్నారు. రెండు నెలల క్రితం ఈ విషయం నా దృష్టికి వచ్చినపుడు షాకయ్యాను. వెంటనే ఈ విషయాన్ని ఏదైనా కమిటీ లేదా లీగల్ బాడీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిపారు.

నా రెప్యుటేషన్ దెబ్బతీయడానికే మీడియా ద్వారా..
అయితే ఎలాంటి ఫిర్యాదు చేయకుండా తన రెప్యుటేషన్ దెబ్బతీసేందుకు ఆవిడ మీడియాను ఆశ్రయించింది. ఈ విషయంలో నేను లీగల్‌గా ప్రోసీడ్ అవ్వబోతున్నట్లు రాజ్ కుమార్ హిరానీ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











