ఆ హీరోయిన్ నెక్లెస్‌తో పెళ్లికొచ్చిన సీనియర్ నటి?.. దారుణంగా ట్రోలింగ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు, సిద్ధార్ధ్ చోప్రా వివాహం ఇటీవల ముంబైలో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌కు చెందిన సినీ నటి నీలమ్ ఉపాధ్యాయ మెడలో ఆయన మూడు ముళ్లు వేశాడు. ఓ డేటింగ్ యాప్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. సిద్ధార్ధ్ - నీలమ్ పెళ్లికి తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి సందడి చేశారు ప్రియాంక చోప్రా. ఈ ఈవెంట్‌లో ఓ నెక్లెస్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
నీలమ్ ఉపాధ్యాయ మిస్టర్ 7 సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యాక్షన్ త్రీడీ, పండుగలా వచ్చాడు, తమాషా సినిమాలలో నటించింది. కానీ ఈమెకు ఈ సినిమాలేవి బ్రేక్ తీసుకురాలేదు. అయినప్పటికీ అవకాశాల కోసం ట్రై చేసిన ఈ ముద్దుగుమ్మ.. తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. ఆ తర్వాత ఆఫర్లు లేక ఎలాగోలా బండి నెట్టుకోస్తోంది. ఈ క్రమంలో సిద్ధార్ధ్ చోప్రాతో పరిచయం పెళ్లికి దారి తీసింది.

అయితే హల్దీ వేడుక సందర్భంగా నీలం అలర్జీ బారినపడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. అలాగే దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నీలం సోషల్ మీడియాలో పంచుకున్నారు. హల్దీ వేడుక కోసం వినియోగించిన పసుపు వల్లే ఇలా వచ్చి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. నీలం మెడ, కాలర్ బోన్ వద్ద చర్మం ఎర్రగా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. హల్దీ వేడుకతో పెళ్లి వేడుకను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన ఆమె వధూవరులు, నిక్ జోనాస్ తల్లిదండ్రులతో కలిసి సందడి చేసింది. హల్దీ, బారాత్ పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే అన్నింటిలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రేఖ ఆమె వేసుకొచ్చిన నెక్లెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 70 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు రేఖ. సిద్ధార్ధ్ - నీలం ఉపాధ్యాయ పెళ్లికి స్పెషల్‌గా డిజైన్ చేసిన ఐవరీ శారీని ధరించిన ఆమె.. దానికి మ్యాచింగ్‌గా జ్యువెలరీ కలెక్షన్స్‌ను సెట్ చేసుకున్నారు. ప్రత్యేకించి రేఖ ధరించిన నెక్లెస్ పైనే అందరి చూపు నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు.. ఆమె వేసుకొచ్చిన నెక్లెస్.. ప్రియాంక చోప్రా తన పెళ్లి నాడు ధరించిన నెక్లెస్‌ను పోలి ఉంది. నాడు తన ట్రెడిషనల్ రెడ్ కలర్ లెహంగాపై ఈ నెక్లెస్‌ను ధరించారు.
ఈ నేపథ్యంలో నాడు ప్రియాంక , నేడు రేఖ ఫోటోలను పోల్చి చూస్తూ ఆ నెక్లెస్‌ను గమనిస్తున్నారు నెటిజన్లు. ప్రియాంక నుంచి రేఖ ఆ నెక్లెస్‌ను తీసుకున్నారా? లేక అలాంటిదే రేఖ డిజైన్ చేయించుకున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్నట్లు ఈ నెక్లెస్‌ను ప్రముఖ ఆభరణాల డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేశారట. అలాగే ప్రియాంక చోప్రా - రేఖలు 2006లో క్రిష్ సినిమాలో కలిసి నటించారు.


Click it and Unblock the Notifications











