twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Lata Mangeshkar పార్థివ దేహం వద్ద చేసిన పనికి షారుఖ్‌పై దారుణంగా ట్రోల్స్.. అసలు ఏమైందంటే?

    |

    భారతదేశ గాన కోకిల లతా మంగేష్కర్ ఆదివారం తుది శ్వాస విడిచారు. విడిచిపెట్టారు. లతా మంగేష్కర్ మరణం కుటుంబ సభ్యులను, ఆమె అభిమానులను మాత్రమే కాదు దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచేసింది. అయితే ఆమె అంత్యక్రియలలో పాల్గొన షారుఖ్ ఆమె కాళ్ళ మీద ఉమ్మాడని ట్విట్టర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది? షారుఖ్ నిజంగానే ఉమ్మారా? ఆయన ఎందుకు ట్రోల్స్ బారిన పడ్డారు? అనే వివరాలలోకి వెళితే

    ఐసియులోనే

    ఐసియులోనే

    లతా మంగేష్కర్ 92 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఆమె జనవరి 8న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ మరియు న్యుమోనియా లక్షణాలు ఉన్నందున అప్పటి నుంచి ఆమె ఐసియులో ఉంది. ప్రతిరోజు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి.

     విషాదమే

    విషాదమే

    అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడినట్లు వార్తలు వచ్చాయి కానీ శనివారం ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఆదివారం ఉదయం ఆమె మరణించారు. లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బడా బడా రాజకీయ నాయకులు, అలాగే బాలీవుడ్ ప్రముఖుల కూడా ముంబైలోని శివాజీ పార్క్ కు చేరుకున్నారు. ఆ సమయంలో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి, అందరి మొహంలోనూ విషాదమే కనిపించింది.

    బయటకు రావడమే మానేసి

    బయటకు రావడమే మానేసి

    అయితే కుమారుతు క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లి వచ్చిన తరువాత అసలు బయటకు రావడమే మానేసిన షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్‌కు వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే, షారుక్‌పై ఇప్పుడు అనుకోకుండా ఒక తప్పుడు వాదన తెర మీదకు వచ్చింది. ఈ కారణంగా అందరూ ఆయనని టార్గెట్ చేసి నానా మాటలు అంటున్నారు. ఇదేం బుద్ది? అంటూ ప్రశ్నిస్తున్నారు.

    ఇస్లామిక్ ఆచారం ప్రకారం

    ఇస్లామిక్ ఆచారం ప్రకారం

    లతా మంగేష్కర్ అంత్యక్రియల సందర్భంగా నివాళులర్పించేందుకు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పై ఉమ్మివేసినట్లు ఆ రోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా, దాని ఆధారంగానే చాలా మంది ఈ ఆరోపణలు చేస్తున్నారు.

    వైరల్ అయిన వీడియోలో, లతా మంగేష్కర్ పార్థివ దేహం కాళ్ళ వద్ద షారుక్ ఖాన్ తన మాస్క్ ను ఎత్తి ఉమ్మివేస్తున్నట్టు ఉండడాన్ని చూడవచ్చు. అయితే ఇస్లాం ప్రకారం ఇది అంత్యక్రియల ప్రక్రియ అని ఉద్దేశపూర్వకంగా చేశారని కొందరు అంటున్నారు. అయితే, ఇస్లాం మతం తెలిసిన చాలా మంది ఈ వాదనను తోసిపుచ్చారు.

    ఒక వ్యక్తి తుది వీడ్కోలు ఇచ్చే సమయంలో అతని లేదా ఆమె శరీరంపై ఒక దెబ్బ తగిలితే, శరీరంతో సంబంధం ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారని చెబుతున్నారు. అందుకే ఇస్లామిక్ ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి శరీరంపై ఫంక్ వేస్తారని చెబుతున్నారు.

    Recommended Video

    Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
    ఆయన ప్రార్థించాడు

    ఆయన ప్రార్థించాడు

    దర్శకుడు అశోక్ పండిట్ ట్విట్టర్‌లో షారుఖ్ వీడియోను ట్వీట్ చేశారు, "కొంతమంది వ్యక్తులు ఇప్పుడు షారూఖ్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. లతా మంగేష్కర్ అంత్యక్రియల సమయంలో ఆయన ఉమ్మివేసినట్లు చెబుతున్నారు. అలాంటి వారు సిగ్గుపడాలి. నిజానికి ఆయన ప్రార్థించాడు, పార్థివ దేహం మీద ఊదాడు. ఇలా చేయడం వల్ల పార్థివ దేహం సురక్షితంగా ఉంటుందని, తదుపరి ప్రయాణానికి సానుకూల శక్తి ఉంటుందని నమ్ముతారు. మన దేశంలో ఇలాంటి మతపరమైన విభజనలకు తావు లేదు' అని ఆయన పేర్కొన్నారు.

    English summary
    Videos going viral on the internet claiming that Shah Rukh Khan 'spit' on Lata Mangeshkar's mortal remains. do you know what really happened?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X