twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లెజెండరీ యాక్టర్ కి అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి.. అసలేమైందంటే?

    |

    బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ దిలీప్ కుమార్ హాస్పిటల్ పాలు కావడం బాలీవుడ్లో ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆయన వయసు ప్రస్తుతం 98 సంవత్సరాలు. శ్వాస కొస సమస్యల కారణంగా ఆయన ఈ రోజు ఉద‌యం ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో చేరారు. కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె, ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రిస్థితిని నితిన్ గోఖ‌లె, జ‌లీల్ ప‌ర్కార్ లు ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

    Dilip Kumar admitted to hospital after complaining of breathlessness

    హాట్ క్లీవేజ్ షో కాక రేపుతోన్న రాజశేఖర్ కూతురు శివాత్మిక

    అయితే నిజానికి గ‌త నెల‌లో కూడా దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రిలో చేరి, రెండు రోజుల తర్వాత అన్ని పరీక్షలు చేయించుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఉదయం ఊపిరి అడకపోవడంతోనే ఆయనని హాస్పిటల్ కి తరలించి ఉండచ్చని అంటున్నారు. నిజానికి గత ఏడాది దిలీప్ కుమార్ సోదరుడు .. అస్లాం ఖాన్.. కరోనాతో కన్నుమూశారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్‌తో చికిత్స తీసుకుంటున్న ఆయనకు కరోనా సోకడంతో పరిస్థితి విషమించి కన్ను మూశారు. అలాగే మరో సోదరుడు ఇషాన్ కూడా కరోనా కారణంగా కన్ను మూశారు.

    Dilip Kumar admitted to hospital after complaining of breathlessness

    ఇప్పుడు దిలీప్ కుమార్ హాస్పిటల్ లో జాయిన్ కావడంతో అందరికీ టెన్షన్ నెలకొంది. ఇక ఆయన భార్య సైరా బాను ఇండియన్ ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఊపిరి పీల్చుకోలేక పోయిన కారణంగా దిలీప్ ను ఖార్ రోడ్‌లోని ఆసుపత్రికి ఉదయం 8.30 గంటలకు తీసుకువెళ్ళాము, వైద్యులు అతనికి చికిత్స చేస్తున్నారు కొన్ని పరీక్షలు జరిగాయి, యా రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము, దయచేసి ఆయనకు మంచి జరిగేలా ప్రార్థించండి అని కోరారు. ఇక దిలీప్ కుమార్ అధికారిక హ్యాండిల్ నుండి ఒక ట్వీట్ జారీ చేయబడింది. ఇది విషయాన్ని ధృవీకరిస్తూ ఆయన కోలుకోవాలని ప్రార్దించమని కోరారు.

    English summary
    Legendary Hindi film actor Dilip Kumar was admitted to hospital on Sunday morning. the same was mentioned in his latest tweet through his official handle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X