కరీనాకు తలవంచి మొక్కిన యువ హీరో.. ఏం జరిగిందంటే!
Recommended Video
అందాల భామ కరీనాకపూర్ వ్యక్తిగతంగాను, ప్రొఫెషనల్‌గానూ బిజీగా ఉంది. సినిమాలు, ఫ్యామిలీ లైఫ్‌తోనే కాకుండా టీవీ షోతో మరింత బిజీగా మారింది. వరుస సినిమాలు చేస్తూనే కరీనా డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ 7 అనే రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అభిమానిగా మారిన యువ హీరో నుంచి కరీనాకు చక్కటి అనుభూతి కలిగించే సంఘటన ఎదురైంది. ఆ సంఘటన ఏమిటంటే..

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోలో
డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే షోలో తమ సినిమా జబరియా జోడి ప్రమోషన్ కోసం సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణితి చోప్రా వచ్చారు. వారితో పాటు ఓ ప్రత్యేకంగా ఓ పాటను డిజైన్ చేసి వేదికపై యువ హీరో దిల్జిత్ సింగ్ హంగామా చేశారు. ఈ సందర్భంగా దిల్జిత్ టాలెంట్‌ను ప్రశంసిస్తూనే కరీనా ఓ ఫిర్యాదు కూడా చేసింది. ఈ షోలో దిల్జిత్ మౌనంగా ఉంటున్నాడు. అది నాకు నచ్చడం లేదని చెప్పింది.

దిల్జీత్ సింగ్‌పై కరీనా ఫిర్యాదు
కరీనా ఫిర్యాదుపై స్పందిస్తూ.. కరీనా అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఆమెకు నేను అభిమానిని. అలాంటి కరీనా ముందు నేను ఏమి మాట్లాడగలను. అందుకే ఆమే కోసం ప్రత్యేకంగా ఓ పాటను కూడా డిజైన్ చేశాను అని దిల్జీత్ సమాధానం ఇచ్చాడు. దాంతో దిల్జిత్‌పై ప్రత్యేకమైన అభిమానాన్ని కురిపించారు. అలాగే తన కోసం డిజైన్ చేసిన పాటకు ఫిదా అయ్యానని కరీనా చెప్పింది.

నా అభిమాన దేవత అంటూ
ఈ సందర్భంగా దిల్జిత్ మాట్లాడుతూ.. నా కళ్ల ఎదుట నా అభిమాన దేవత ఉంటే మౌనంగా మారిపోతాను. అందుకే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను. ఆమె కోసమే ఈ పాటను క్రియేట్ చేశాను. నాకు హాలీవుడ్‌లో కైలీ, బాలీవుడ్‌లో కరీనా అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అంతేకాకుండా నాకు స్ఫూర్తిని ఇస్తున్న నా అభిమాన నటికి చేతులెత్తి నమస్కారం అంటూ దిల్జిత్ మొక్కడంతో కరీనా కరిగిపోయింది.

కరీనాతో కలిసి దిల్జిత్ సింగ్
ఇక తన అభిమాన నటి కరీనాతో కలిసి ఉడ్తా పంజాబ్‌లో దిల్జిత్ నటించారు. ఆ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా దిల్జిత్ నటించే సినిమా అర్జున్ పాటియాలా సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ పాటను డిజైన్ చేసి కరీనాను మెప్పించాడు. ఇక కరీనా, అక్షయ్ కపూర్‌తో కలిసి మరోసారి గుడ్‌న్యూస్ చిత్రంలో దిల్జిత్ కనిపించబోతున్నాడు. ఇక కరీనా కపూర్ అంగ్గేజ్ మీడియం అనే చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌తో నటించింది.


Click it and Unblock the Notifications











