మరోసారి ప్రేక్షకుల ముందుకు డీడీఎల్జే

దిల్వాలే దుల్హనియా లేజేయాంగే అన్న పేరు వింటేనే సినీ ప్రేమికులు మైమరచిపోతారు. 1995 లో విడుదలైన ఈ ప్రేమ కావ్యం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ఆ తరువాత ఎన్నో ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమానే ఊపిరి పోసింది అనడంలో అతిశయోక్తిలేదు. 'తుజే దేఖా తో యే జానా సనమ్‌' అంటూ సాగే ఈ పాటని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు సినీ జనాలు.

ఇదే సినిమాలో రైల్వే స్టేషన్‌లో వచ్చే సీన్‌ని అయితే కొన్ని వందల సినిమాల్లో రిపీట్‌ చేశారు. ఈ సినిమాతోనే షారుఖ్‌-కాజోల్‌ జోడీ ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది . ప్రేమికులు అంటే వీరిలానే ఉండాలి అనేంతగా షారుక్ కాజోల్ నటించారు.

ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది. అక్టోబర్ 20 తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక సినిమా విడుదలై25 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ చిత్రం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే ఆ ప్రేమకథ వెండితెరపై, సినీప్రియుల మనసులపై ఎలాంటి ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు.

Dilwale Dulhania Le Jayenge to re-release in 18 countries

కేవలం నాలుగు కోట్ల రూపాయలతో తెరకెక్కిన డీ.డీ. ఎల్. జె ఆ ఏడాది ఏకంగా 89 కోట్లు వాసులు చేసింది. ఓవర్సీస్ మార్కెట్ ను కూడా కలుపుకొని మొత్తంగా 102.50 కోట్లు వాసులు చేసింది. అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను 18 దేశాల్లో విడుదల చేస్తున్నారు. జర్మనీ , యుఎఈ , సౌదీ అరేబియా, ఖతార్, యుఎస్ఎ, యుకె, కెనడా, మారిషస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, నార్వే, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఎస్టోనియా , ఫిన్లాండ్ దేశాల్లో డీడీఎల్జే మరోసారి సందడి చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X