For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఓ అమ్మాయికి 300 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ .. సమాజం ఒప్పుకుంటుందా? మున్నాభాయ్‌పై హీరోయిన్ ఫైర్

  |

  ప్రస్తుతం మనమున్న కాలంలో నోటికిష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడటం సరికాదు. ఎందుకుంటే ఒకరికి సరదాగా అనిపించిన మాటలే మరొకరికి బాధను కలిగించవచ్చు. అసలే ప్రతీ మాటను భూతద్దంలో చూపెట్టే సోషల్ మీడియా కూడా విస్తరించి పోయింది. ఇలాంటి కాలంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచింది. తక్కువగా మాట్లాడితే మరింత మంచింది. ఈ విషయం తెలియని మున్నా భాయ్.. బాలీవుడ్ పెద్దన్న సంజయ్ దత్ నోరుజారి ఓ మాట తూలాడు. అదే ప్రస్తుతం వైరల్ అవుతోంది.

  వరుస సినిమాలో బిజీ..

  వరుస సినిమాలో బిజీ..

  ప్రస్థానం, కేజీఎప్ చాప్టర్ 2, బాలయ్య బోయపాటి సినిమాలో ఇలా వరుసగా ప్రాజెక్ట్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు సంజయ్ దత్. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో కలిసి ‘పానిపత్' అనే సినిమా చేసాడు. ఈ సినిమాలో మహ్మద్ షా అబ్దాలీగా నెగెటివ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ టాక్ షోలో పాల్గాన్నాడు. గతంలో ఈ షోలో పాల్గొన్న వారు ఎంతో మంది విమర్శల పాలయ్యారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంజు వంతు వచ్చినట్టైంది.

  జైల్లో సంపాదించిన డబ్బులతో..

  జైల్లో సంపాదించిన డబ్బులతో..

  మీరు జైలులో ఉన్నపుడు పేపర్ బ్యాగులు తయారు చేశానన్నారు. ఒక్కో బ్యాగుకు పది పైసలు వచ్చేవన్నారు. ఆ విధంగా తాను సంపాదించిన ఆ సినిమాను రాఖీ పండగ రోజున తన చెల్లెలికి ఇచ్చానని సంజయ్ తెలిపారు. ఈ విషయం చెప్పినపుడు సంజయ్ దత్ భావోద్వేగానికి లోనయ్యాడు.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  సరదాగా సమాధానం..

  సరదాగా సమాధానం..

  మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘నాకు ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఇంకా లెక్కపెట్టలేదు. కృతి సనన్‌ని నా 308వ గర్ల్ ఫ్రెండ్‌ని చేసుకోవాలని అనుకుంటున్నా' అంటూ సరదాగా నవ్వేశాడు. దీంతో ఆ షోలో ఉన్నవారు, హోస్ట్ కూడా పగలబడి నవ్వేశారు. అయితే అక్కడితోనే మొదలైంది వివాదం.

  స్పందించిన హీరోయిన్..

  అయితే ఈ కామెంట్ సరికాదు అంటూ నటి దీపాన్నిత శర్మ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. ఆయనలా ఒక అమ్మాయి అలా వ్యాఖ్యానిస్తే ఈ సమాజం ఊరుకుంటుందా? సినిమా ప్రమోషన్ కోసం 300 మంది గాళ్ ఫ్రెండ్స్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. అంటూ విమర్శలు గుప్పించింది.

  సోషల్ మీడియా ట్వీట్ వైరల్..

  సోషల్ మీడియా ట్వీట్ వైరల్..

  ‘ఓ యాక్టర్ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా వచ్చి.. 300 మందికి పైగా గర్ల్ ఫ్రెండ్స్‌తో ఉన్న వ్యవహారం గురించి మాట్లాడాడు. వాటికి అక్కడి వారంతా నవ్వారు. అదే ఓ మహిళా అలాంటివి మాట్లాడితే సమాజం ఒప్పుకుంటుందా? అది జోక్‌లా తీసుకుంటారా? ఈ లింగ వివక్ష దగ్గరే మొత్తం తప్పు జరుగుతోంది. ఇదే అన్నింటికి కారణం' అంటూ దీపాన్నిత శర్మ ట్వీట్ చేసింది.

  English summary
  Dipannita Sharma Fires On Sanjay Dutt Comments Over 300 Girl Friends. An actor on a show to promote his next release talks about his score of over 300 girlfriends.The host & audience laughs in good jest.What If a woman said the same thing on a show?Would that be a joke too?This basic gender bias is what has always been wrong.The root of all evil !
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more