బాలీవుడ్ లోకి మరో తెలుగు దర్శకుడు.. ఆ హీరోతో అల్లు అర్జున్ మూవీ రీమేక్?

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మన తెలుగు హీరోల మార్కెట్ తో పాటు దర్శకుల స్థాయి కూడా ఒక్కసారిగా పెరిగిపోతోంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలు రీమేక్ మాత్రమే అయ్యేవి. నటి నటులు కూడా ఆ ఇండస్ట్రీలో అంతగా సక్సెస్ అయ్యే వారు కాదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం అగ్ర హీరోలు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి అనంతరం పుష్పతో కూడా టాలీవుడ్ రేంజ్ ఏమిటో మరోసారి బాలీవుడ్ కి బాగా అర్ధమయ్యింది.

అంతేకాకుండా దర్శకులు కూడా అక్కడ చక్రం తిప్పే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు దర్శకులకు మంచి డిమాండ్ ఉంది. బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రభాస్ రాజమౌళి కలయిక తర్వాత పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సుకుమార్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా బాగా ఫేమస్ అయ్యారు. ఇక పుష్ప సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా 100 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా బన్నీ పాత సినిమాలపై పడింది.

 Director harish shankar dj remake plans in bollywood

ఇక్కడి నుంచి వచ్చే సినిమాలకు మంచి డిమాండ్ ఉందని కొన్ని బడా నిర్మాణ సంస్థలు కూడా తెలుగు సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో చాలా పాజిటివ్ గా తెరపైకి తీసుకువచ్చే హరీష్ శంకర్ తన పాత సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లుఅర్జున్ తో గతంలో చేసిన డీజే దువ్వాడ జగన్నాదమ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే అదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఒక ప్రముఖ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దర్శకుడిగా హరీష్ శంకర్ ను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారట. ఇటీవల హీరో విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. హీరో వరుణ్ ధావన్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా హరీష్ డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాలన్నీ కూడా హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో విడుదల చేయగా వందల మిలియన్ల వ్యూవ్స్ అందుకున్నాయి. దువ్వాడ జగన్నాథం సినిమా కూడా హిందీ లో ఇదివరకు డబ్ అయ్యింది. ఆ సినిమాకు కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు వరుణ్ ధావన్ తో చేయబోయే రీమేక్ సినిమాలో మాత్రం భారీ స్థాయిలో మార్పులు చేయక తప్పదు. అందుకే హరీష్ శంకర్ కథలోని అసలు అంశాన్ని తీసుకుని స్క్రీన్ ప్లేను పూర్తిగా బాలీవుడ్ వాతావరణంకు తగ్గట్టుగా తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X