twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ దర్శకుడికి ఉగ్రవాదుల బెదిరింపులు.. చంపేస్తామని హెచ్చరికల.. సీక్రెట్ లీక్ అలా..

    |

    బాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెండ్ దర్శకుల్లో కబీర్ ఖాన్‌ ఒకరు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విధంగా భజరంగీ భాయ్‌జాన్ లాంటి చిత్రాలను హిందీ సినీ పరిశ్రమకు అందించారు. అలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడికి బెదిరింపులు వచ్చాయని తెలపడంతో బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే కబీర్ ఖాన్‌కు ఎవరి నుంచి ఎప్పుడు బెదిరింపులు వచ్చాయనే విషయంలోకి వెళితే..

    దౌత్య కార్యాలయం నుంచి కాల్

    దౌత్య కార్యాలయం నుంచి కాల్


    దర్శకుడు కబీర్ ఖాన్ ఇటీవల ముంబై మీడియాతో మాట్లాడుతూ.. ఒక రోజు భారతీయ దౌత్యవేత్త కాల్ చేశాడు. హీరు ఎలా ఉన్నారు అని యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నాడు. అప్పుడే నేను షూటింగులో ఉాండటంతో ఆ విషయాన్ని చెప్పాను. అయితే షూటింగు అయిపోయిన తర్వాత ఓసారి ఆఫీస్ రాగలరా అని అడిగారు. దాంతో నేను సరే అని చెప్పాను అని కబీర్ ఖాన్ తెలిపారు.

    తాలిబాన్ టెర్రిరిస్టుల నుంచి ప్రాణహాని

    తాలిబాన్ టెర్రిరిస్టుల నుంచి ప్రాణహాని

    షూటింగు ముగించుకొని భారతీయ రాయబార కార్యాలయానికి వెళ్లి అధికారులును కలిశాను. ఆ సమయంలో భారతీయ రాయబారితోపాటు సైన్యాధికారులు కూడా ఉన్నారు. నన్ను లోపలికి తీసుకెళ్లి.. మీకు తాలిబాన్ టెర్రరిస్టుల నుంచి ప్రాణహాని ఉందనే విషయం అమెరికా, అఫ్ఘనిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని తెలిపారు.

    మిమ్మల్ని మట్టుపెట్టడానికి, మీ షూటింగ్ యూనిట్‌ను ధ్వంసం చేయడానికి ఐదుగురు ఉగ్రవాదులు రంగంలోకి దిగారని చెప్పగానే నేను షాక్‌లో ఉండిపోయాను అని కబీర్ ఖాన్ తెలిపారు.

    అధికారులు, సైన్యం సహకారంతో

    అధికారులు, సైన్యం సహకారంతో

    భారతీయ దౌత్యవేత్తల హెచ్చరికలతో నేను, మా షూటింగ్ యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యాం. అఫ్ఘనిస్థాన్ సైనికాధికారుల నుంచి సపోర్ట్ లభించడంతో టెన్షన్ల మధ్య షూటింగ్ చేశాం. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. తాలిబాన్ మీ షూటింగ్‌ను ఎలా ఆపుతుందో మేము తేల్చుకొంటాం. మీరు ధైర్యంగా పనిచేసుకోండి. మేము మీకు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారని కబీర్ ఖాన్ అన్నారు.

    షూటింగ్ ఆపితే.. ఓడిపోయినట్టే..

    షూటింగ్ ఆపితే.. ఓడిపోయినట్టే..

    పాకిస్థాన్, ఆఫ్ఘన సరిహద్దులో షూటింగ్ జరుగుతుండగా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో షూటింగును ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు అని చెప్పారు.
    ఒకవేళ షూటింగ్ ఆపితే మీరు ఓడిపోయినట్టే అని అన్నారు. దాంతో మేము ఎవరికి భయపడకుండా సైన్యం అండతో షూటింగ్ ఫినిష్ చేశాం. ఆ సమయంలో మేము అనుభవించిన టెన్షన్ మాటల్లో చెప్పలేం అని కబీర్ ఖాన్ చెప్పారు.

    కబీర్ ఖాన్ కెరీర్ ఇలా..

    కబీర్ ఖాన్ కెరీర్ ఇలా..

    కబీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. కాబూల్ ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఆ తర్వాత న్యూయార్క్, ఏక్ థా టైగర్, భజరంగీ భాయ్‌జాన్, ఫాంటామ్, ట్యూబ్‌లైట్, ది ఫర్గాటెన్ ఆర్మీ, 83 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భజ్ రంగీ భాయ్ జాన్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి రికార్డు కలెక్షన్లు అందించారు. 83 వరల్డ్ కప్ నేపథ్యంగా అద్బుతమైన బయోపిక్‌ను ప్రేక్షకులకు అందించారు.

    English summary
    Director Kabir Khan gets death threat from Taliban Terrorists. He revealed in latest Interview, How Indian, Afgan embassy officials help his team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X