ప్రభాస్ 'ఆదిపురుష్'కు భిన్నమైన టాక్.. డైరెక్టర్ తొలి రియాక్షన్ ఎలా ఉందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక్కో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తూ భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురచూసిన రామాయణ మహా కావ్యంతో తెరకెక్కిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విభిన్నమైన టాక్ వస్తోంది. కొంతమంది చాలా బాగుంది అంటే మరికొంతమంది బాగాలేదంటున్నారు. దీంతో డైరెక్టర్ ఓం రావత్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓం రావత్ ఆదిపురుష్ రిలీజ్ తర్వాత ఇచ్చిన తొలి రియాక్షన్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రామాయణం ఆధారంగా రూపొందిన ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. శ్రీరాముడిగా ప్రభాస్ అలరించిన ఈ సినిమాలో పది తలల రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతాదేవిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక హనుమంతుడి పాత్రలో మరాఠీ పాపులర్ నటుడు దేవదత్తా నాగే, లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ చేశారు. ఇంకా ఇందులో సోనాల్ చౌహన్, తేజస్విని పండిట్, వత్సల్ సేథ్ నటించారు.

ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మాణంలో భూషణ్ కుమార్, క్రిష్ణ కుమార్, ప్రసాద్ సుతారియా, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, ఓం రావత్ నిర్మాతలుగా వ్యవహరించారు. అలాగే తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. తానాజీ వంటి హిట్ చిత్రం తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ ఆదిపురుష్ మూవీకి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక జూన్ 16న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.

ఆదిపురుష్ మూవీకి డివైడ్ టాక్ వస్తున్న కలెక్షన్స్ మాత్రం అదరగొడుతున్నాయి. అయితే తాజాగా కొందరు నెటిజన్లు మాత్రం డైరెక్టర్ ఓం రావత్ ను ట్రోల్ చేస్తున్నారు. "కథను వక్రీకరించి తనకు నచ్చినట్లుగా తెరకెక్కించారు. ఇదీ ఓం రావత్ రామాయణం", "ఓం కమ్ టు మై రూమ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమాపై తొలిసారిగా ఓం రావత్ రియాక్ట్ అయ్యారు.
థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫొటోలను డైరెక్టర్ ఓం రావత్ షేర్ చేశారు. "భారతదేశంలోని అన్ని థియేటర్లు భక్తితో నిండి పోయాయి. జై శ్రీరామ్" అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆదిపురుష్ పై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ ఓం రావత్ స్పందించలేదు.


Click it and Unblock the Notifications











