లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్.. మర్చిపోలేని మధురానుభూతి అంటూ షాక్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాతో కూడా సంచలనాలు సృష్టించవచ్చని ప్రూవ్ చేశారు 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. దీంతో మొదటి సినిమానే అయినా ఆయనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. హీరోహీరోయిన్స్ నడుమ రొమాన్స్ పండించడంలో బాగా సక్సెస్ అయ్యారు సందీప్ రెడ్డి. ముద్దులతో మ్యాజిక్ చేయడంలో తనకు సాటెవ్వరూ లేరనే రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఇదే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో పడ్డారు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ పేరుతో ఆయన దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఎక్కువ సమయం ముంబైలో గడిపిన ఈయన ఎన్నో మధురానుభూతులు అనుభవించారట. కబీర్ సింగ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తన ఫీలింగ్స్ చెప్పి షాకిచ్చారు సందీప్.

Director Sandeep Vangas feelings on Mumbai City

'కబీర్ సింగ్' సినిమా షూటింగ్ నిమిత్తమై ముంబై వెళ్లిన సందీప్ రెడ్డి వంగా ఉండటం కోసం ముంబై పశ్చిమ శివారులోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ ను కేటాయించారు ఆ చిత్ర నిర్మాతలు. అక్కడ ఉంటూనే కబీర్ సింగ్ పూర్తి చేశారు సందీప్ రెడ్డి. అయితే జాలీగా గడిపిన ఈ కొన్ని రోజుల్లోనే ముంబై నగరం తనకు ఎంతగానో నచ్చేసిందని అంటున్నారు సందీప్. ''కబీర్ సింగ్ కోసం నేను ఏడాదిగా ముంబైలోనే ఉంటున్నాను. నాకెన్నో మర్చిపోలేని మధురానుభూతుల్ని మిగిల్చింది ముంబై నగరం. ముంబై నగరంతో నేను ప్రేమలో పడిపోయా. ముంబై నాకెప్పటికీ గుర్తుండి పోతుంది. భవిష్యత్ లో కూడా ఇక్కడికి వస్తుంటాను'' అని సందీప్ రెడ్డి వంగా తన అనుభవాలను పంచుకున్నారు.

ఇక కబీర్ సింగ్ విషయానికొస్తే.. షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొద్దిరోజుల క్రితం విడుదలైన 'కబీర్ సింగ్' టీజర్, ట్రైలర్ భారీ తెచ్చుకోవడంతో బాలీవుడ్ లో ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందని చిత్ర యూనిట్ ఆత్మవిశ్వాసంతో ఉంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X