ఛత్రపతి కోసం మరోసారి రంగంలోకి రాజమౌళి.. వినాయక్ ప్లాన్ మామూలుగా లేదు
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఛత్రపతి సినిమా హిందీలో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమాను మరోసారి చేసే గట్స్ ఎవరికున్నాయని అనుకుంటున్న తరుణంలో బెల్లంకొండ శ్రీనివాస్, వినాయక్ కాంబో సెట్టవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
పెన్ స్టూడియోస్ లో తెరకెక్కనున్న ఈ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇటీవల దర్శకుడు వివి.వినాయక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాపై ఒక క్లారిటి ఇచ్చాడు. ఈ సినిమాను మొదట తమ వద్దకు తీసుకు వచ్చింది పెన్ స్టూడియోస్ వాళ్లేనని చెబుతూ బెల్లంకొండకు హిందీలో క్రేజ్ ఉండడమే అందుకు కారణమని అన్నారు.

ఇక సినిమా స్క్రిప్ట్ విషయంలో ఒరిజినల్ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ గారి చేత రైటింగ్ కోసం సహాయం కూడా తీసుకుంటామని చెప్పిన వినాయక్ అలాగే రాజమౌళితో కూడా చర్చలు జరపనున్నట్లు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కొన్ని హిందీ సినిమాలకు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పెన్ను సహాయం తీసుకోవాడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాజమౌళి RRRతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిన తరువాత తప్పకుండా మరోసారి ఛత్రపతి రీమేక్ పై జక్కన్న చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాజమౌళికి వినాయక్ మంచి స్నేహితుడిలా ఉంటున్నాడు. మరి వారి సలహాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











