Parineeti Chopra: ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడి ఊహించని కౌంటర్.. అందుకే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ..
అన్నిటికంటే ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. అలాగే సెలబ్రిటీలు అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ కి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సొంత ఊరిలో కాకుండా ఇంకెక్కడికో వెళ్లి పెళ్లి చేసుకోవడం అనే కొత్త సంప్రదాయం వచ్చింది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కొత్తజంటలు చేసే విన్యాసాలు వైరల్ గా మారుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇలాంటి పెళ్లి వేడుకలపై ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. అసలు పెళ్లి అనేది ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోలు, వీడియోల కోసమే చేసుకుంటున్నట్లు ఉందని అన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ బ్రాండ్ కోసం చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారని ఓ వెడ్డింగ్ ప్లానర్ తనకి చెప్పారు. అది నిజమే అనిపించింది.

నేను ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఉన్న సమయంలో ఫోటోగ్రాఫర్ కాస్తా ఆలస్యంగా వస్తాడని ఎవరో చెప్పారు. అది విన్న పెళ్లికూతురు కళ్ళు తిరిగి పడిపోయింది అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీనికి కారణం తాజాగా పరిణితి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో నిశ్చితార్ధం చేసుకుంది. వారిని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని ఉద్దేశించి వివేక్ అగ్నిహోత్రి కామెంట్స్ చేసారని సోషల్ మీడియాలో అతని పోస్ట్ పై రియాక్ట్ అవుతున్నారు.

వివేక్ అగ్నిహోత్రి ఇంతకుముందు చాలాసార్లు బాలీవుడ్ స్టార్స్ పైన ఇన్ డైరెక్ట గా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ పరిణితి నిశ్చితార్థం అవుతున్న సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఆయనతో ఏకీభావించేవారు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఎవరి ఇష్టం వారిది అని పెళ్లి అనేది జీవితంలో చేసుకునే ఓకే ఒక్క వేడుక అని కాబట్టి వారికి నచ్చిన విధానంలో చేసుకునే దానిపై అనవసరమైన కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











