సినీ పరిశ్రమలో మరో విషాదం: అనుమానాస్పద రీతిలో ప్రముఖ నటి మృతి
సినీ పరిశ్రమను వరుస మరణాలు కలచి వేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు కరోనా కారణంగా మరణించారు. ఆ మధ్య బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం పెద్ద సంచలనం అయింది. ఇక, ఇటీవల తమిళనాడుకు చెందిన బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనలను మరవక ముందే బాలీవుడ్‌లో మరో నటి మరణించారు. కోల్‌కతాకు చెందిన ప్రముఖ నటి ఆర్య బెనర్జీ శుక్రవారం ఆమె నివాసంలో శవమై కనిపించారు. దీంతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'దర్టీ పిక్చర్' సినిమాలో షకీలా పాత్రను పోషించిన ఆర్య బెనర్జీ.. దక్షిణ కోల్‌కతాలో నివాసం ఉంటోంది. శుక్రవారం ఆమె ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. చాలా రోజులుగా ఆర్య ఒంటరిగా ఉంటోంది. ఆమెకు సహాయంగా ఓ పని మనిషి ఆ ఇంటికి వచ్చి పోతుంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆమె ఇంటికి రాగా, తలుపులు పెట్టేసి ఉన్నాయట. ఎంత కొట్టినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో సదరు పని మనిషి పోలీసులకు సమాచారం అందించారట.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఆర్య బెనర్జీ తన బెడ్‌పై అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నారు. ఆమె ముఖం, మెడపై గాయాలు ఉండడంతో పాటు ఆ ప్రదేశంలో రక్తపు మరకలు ఉన్నాయని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె పడి ఉన్న ప్రదేశంలోనే వాంతు చేసుకున్నట్లు గుర్తులు ఉన్నాయి. దీంతో ఇది హత్యా? ఆత్మహత్య? అన్నది సస్పెన్స్‌గా మారింది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై విచారణ జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











