twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా ప్లాప్ అవ్వడం మంచిదే.. కత్రినా కైఫ్ ఎందుకిలా అంటోంది?

    |

    అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' 2018లో అతిపెద్ద ప్లాప్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించగా... తాజాగా ఈ పరాజయంపై కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ''అమీర్ ఖాన్ ఈ సినిమా పరాజయంపై ఇప్పటికే మాట్లాడారని తెలుసు. ఇలా జరుగడం వ్యక్తిగతం‌గా నన్ను చాలా బాధించింది. అయితే ఇలాంటి ప్లాపులు ఎదురవ్వడం కూడా మంచిదే. ఈ సమయంలోనే మన కళ్లు తెరుచుకుంటాయి' అని కత్రినా వ్యాఖ్యానించారు.

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్

    ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' విషయంలో మా ప్రయత్నం మేము చేశాం. అందులో ఎలాంటి లోపం లేదు. అయితే ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు ఎదుర్కొనే గట్స్ కూడా ఉండాలి. మన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశంగా దీన్ని భావించాలి' అని కత్రినా చెప్పుకొచ్చారు.

    ఈ దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంది

    ఈ దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంది

    కాగా.. కత్రినా ప్రస్తుతం తన తాజా చిత్రం ‘జీరో' ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె మూవీ స్టార్ బబితా పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా విడుదల ముందే అది బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చెప్పడం చాలా కష్టమని తెలిపారు. అయితే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ మీద పూర్తి నమ్మకం ఉందన్నారు.

     దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేను

    దానికి సమాధానం ఇప్పుడే చెప్పలేను

    ‘జీరో' చిత్రం గురించి ఒకటి మాత్రం చెప్పగలను. మంచి సినిమాలను, మంచి కథలను నేను నమ్ముతాను. మన సినిమా ఇండస్ట్రీలో ఆనంద్ ఎల్ రాయ్ ఫైనెస్ట్ స్టోరీ టెల్లర్. అతడు చెప్పే కథ ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అందులో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అయితే ఫలితం ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు సమాధానం సినిమా విడుదల తర్వాతే దొరుకుతుంది అన్నారు.

    జీరో

    జీరో

    షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జీరో' చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్వకత్వంలో షారుక్ భార్య గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించబోతున్నారు.

    English summary
    “I know Aamir has spoken on the matter and it has really hurt deeply and personally. Disappointment is always good as it wakes you up little bit again. “In case of ‘Thugs of hindostan’ it was not for lack of trying, something just went wrong in case of Thugs of Hindostan. You need to have guts and urge to try things and be prepared it may or may not work,” Katrina said in an interview.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X