కొత్త లవర్‌తో ప్రభాస్ హీరోయిన్ హల్చల్: నైట్ టైంలో అలా క్లోజ్‌గా!
బాలీవుడ్‌లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో హాట్ లేడీ దిశా పటానీ ఒకరు. అంతలా ఈ అమ్మడు తనదైన చిత్రాలతో తెగ సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది.
ఇలా చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నా తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఈ భామ.. చక్కగానే సాగిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు దిశా పటానీ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తెగ హల్చల్ చేస్తోంది. తాజాగా అతడితో కొన్ని ఫొటోలను దిగింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

అలా ఎంట్రీ.. స్టార్‌డమ్: మోడల్‌గా సెన్సేషన్ అయిన దిశా పటానీ 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఫేమస్ అయింది. అప్పటి నుంచి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలతో అలరించింది.

ఇప్పుడా సినిమాలతోనే: చాలా కాలం పాటు బాలీవుడ్‌లోనే వరుసగా సినిమాలు చేసిన దిశా పటానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీలతో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ చిన్నది ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ప్రాజెక్టు కల్కి'లో భాగం అయింది. అలాగే, సూర్య 'కంగువా'లోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో సైతం దిశా పటానీ నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

హీరోతో బంధానికి బ్రేక్: సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత మేటర్ లీక్ అవడంతో బహిరంగంగానే రెచ్చిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలోనే బ్రేకప్ చెప్పుకున్నారని క్లారిటీ వచ్చింది.

అతడితో దిశా డేటింగ్: టైగర్ ష్రాఫ్‌కు బ్రేకప్ చెప్పిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ.. తన జిమ్ ట్రైనర్, విదేశీయుడు అయిన అలెగ్జాండర్ అలెక్ అనే కుర్రాడితో డేటింగ్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు అలెగ్జాండర్.. దిశా పలుమార్లు కెమెరాల కంటికి చిక్కి బుక్కయ్యారు. దీంతో వీళ్లిద్దరి గురించి బాలీవుడ్ మీడియా తెగ హైలైట్ చేస్తుండడంతో మరింత రెచ్చిపోతోన్నారు.
సోషల్ మీడియాలోనూ: దాదాపు పదేళ్లుగా వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. వీటిలో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది.

గ్లామర్ షో.. అతడి పిక్స్: సోషల్ మీడియాలో దిశా పటానీ ఏ రేంజ్‌లో రచ్చ చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. అలాగే తన కొత్త ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా షేర్ చేస్తోంది. తద్వారా నిత్యం వార్తల్లో నిలవడంతో పాటు తెగ హైలైట్ అయిపోతోంది. ఈ మధ్య కాలంలో అలెగ్జాండర్‌తో దిగిన ఫొటోలనే వదులుతోంది.

రొమాంటిక్ పిక్స్ షేర్ చేసి: స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాంటిక్ ఫోజులు ఇచ్చింది. అంతేకాదు, ఇద్దరూ కలిసి క్లోజ్‌గానే ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











