దిశా పటాని డేటింగ్‌పై క్లారిటీ.. చివరకు ఇలా నిర్ణయించుకున్నారా?

సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశాపటానికి సంబందించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వచ్చారు. పలు కార్యక్రమాలకు సైతం జంటగా వచ్చి ఎన్నోసార్లు మీడియాకు చిక్కారు. అయితే ఇటీవలి కాలంలో వీరిద్దరి ప్రేమాయణానికి బ్రేక్ పడిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలు నిజమే అని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

లోఫర్ బ్యూటీ దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ జోడీ ఇకపై లవ్ బర్డ్స్ లా కాకుండా స్నేహితులుగా ఉండనున్నారని తెలుస్తోంది. నిజానికి పెళ్లి చేసుకొని ఒక్కటవుదామని నిర్ణయించుకున్న ఈ జంటకు టైగర్ ష్రాఫ్ తల్లి అడ్డు చెప్పిందని సమాచారం. ఈ మేరకు తమ రిలేషన్ షిప్ విషయంలో పూర్తి క్లారిటీకి వచ్చేశారట దిశా పటానీ- టైగర్ ష్రాఫ్. తామిద్దరం బ్రేకప్ తీసుకోబోతున్నాం అని వస్తున్న వార్తలను నిజం చేస్తూ ఇకపై స్నేహితులుగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసిందట ఈ జోడీ. ఈ విషయాన్ని వారిద్దరి సన్నిహితులు లీక్ చేశారు.

Disha Patani And Tiger Shroff Have Officially Broken..?

నిజానికి తామిద్దరం డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని ఇదివరకెప్పుడూ స్వయంగా ప్రకటించలేదు ఈ జోడీ. కానీ పలు ఈవెంట్స్ లో చెట్టాపట్టాలేసుకు తిరగడంతో ఈ ఎఫైర్ బయటపడింది. అదేవిధంగా దిశా గానీ, టైగర్ గానీ తమ మధ్య ఎఫైర్ నడుస్తుందని వస్తున్న వార్తలు ఖండించిన సందర్భాలు లేవు. మేం కేవలం స్నేహితులు మాత్రమే అంటూ ఇంతకాలం ప్రేమాయణాన్ని సాగించిన ఈ ఇద్దరూ ఇకపై నిజంగానే స్నేహితులుగా మారబోతున్నారట. అయినా బాలీవుడ్ హీరోహీరోయిన్లకు ఇవన్నీ కామనే లెండి! ప్రస్తుతం దిశా పటాని, టైగర్ ష్రాఫ్ తమ తమ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'భారత్' మూవీ ద్వారా అలరించింది దిశా పటాని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X