కొత్త లవర్‌తో బుక్కైన స్టార్ హీరోయిన్: అందరి ముందే అలా కనిపించడంతో!
సాధారణంగా సినీ రంగంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. అయితే, అందులో హీరోయిన్లు మాత్రం తమ ఎఫైర్ల విషయంలో పెద్దగా బయటపడరు. కానీ, కొందరు భామలు మాత్రం తరచూ డేటింగ్‌లతో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో దిశా పటానీ ఒకరు. చాలా కాలంగా ఈ అమ్మడు లవ్ ట్రాకులతోనే సెన్సేషన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దిశా పటానీ తన బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా బుక్కైపోయింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
వరుస మూవీలతో స్టార్‌గా:టీనేజ్‌లో ఉన్నప్పుడే మోడల్‌గా యమ హైలైట్ అయిన దిశా పటానీ.. 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. దీని తర్వాత 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలతో స్టార్‌గా మారిపోయింది.

ఇప్పుడు ఆ మూవీలతో:బాలీవుడ్‌లోకి ఎంటరైన తర్వాత వరుసగా సినిమాలు చేసిన దిశా పటానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీలతో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ చిన్నది ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'కల్కీ 2898 ఏడీ'లో భాగం అయింది. అలాగే, సూర్య 'కంగువా'లోనూ నటిస్తోంది. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో సైతం దిశా పటానీ నటిస్తూ తెగ హల్చల్ చేసేస్తోంది.
హీరోకు బ్రేకప్ చెప్పేసి:బాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో చాలా కాలంగా ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత మేటర్ లీక్ అవడంతో బహిరంగంగానే రెచ్చిపోయింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా ఈ సినీ జంట బ్రేకప్ చెప్పేసుకుంది.

ట్రైనర్‌తో దిశా డేటింగ్:టైగర్ ష్రాఫ్‌తో విడిపోయిన తర్వాత బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ.. తన జిమ్ ట్రైనర్, విదేశీయుడు అయిన అలెగ్జాండర్ అలెక్ అనే కుర్రాడితో డేటింగ్ చేస్తోన్నట్లు టాక్ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు అలెగ్జాండర్.. దిశా పలుమార్లు కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీళ్లిద్దరి మధ్య బంధం బహిర్గతం అయింది. అప్పటి నుంచి దిశా పటానీ అతడితో పబ్లిక్‌గానే తిరుగుతోంది.
అందులో కూడా జంటే:అందం, అభినయంతో మెప్పిస్తూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏవో ఒక అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో దిశా తన ప్రియుడి గురించి ఎక్కువగా పోస్టులు చేస్తూ రెచ్చిపోతోంది.

అడ్డంగా దొరికిపోయారు:ఈ మధ్య కాలంలో తన ప్రియుడు అలెగ్జాండర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోన్న దిశా పటానీ.. తాజాగా ఓ రెస్టారెంట్ దగ్గర కనిపించింది. ఆ సమయంలో వాళ్లతో పాటు మౌనీ రాయ్ కూడా ఉంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. అలెగ్జాండర్ తన చేతిపై దిశా ముఖాన్ని టాటూగా వేయించుకున్నాడు. దీంతో ఇది బాగా హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది.


Click it and Unblock the Notifications











