Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అతనికి నాకు వయసులో చాలా తేడా ఉంది.. ఇక చేయడం నా వల్ల కాదు.. సెక్సీ బ్యూటీ దిశా పటాని
అందానికి తానే కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది లోఫర్ పాప దిశా పటాని. ఎప్పటికప్పుడు హాట్ హాట్ లుక్కులతో సోషల్ మీడియా ద్వారా ఇటు హీరోలకు అటు కుర్రకారుకు గాలం వేస్తుండటం ఈ యంగ్ హీరోయిన్‌కి వెన్నతో పెట్టిన విద్య. అందం గానీ అభిప్రాయం గానీ పంచుకోవడంలో కూడా దిశా పటాని స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటారని ఆమె తీరు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోపై ఆమె స్పందించిన తీరు చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి భారత్ అనే సినిమాలో నటించింది దిశా. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ మెయిన్ హీరోయిన్ గా నటించగా.. దిశా మరో స్పెషల్ రోల్ లో సల్మాన్ తో రొమాన్స్ చేసింది. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రంజాన్ కానుకగా జూన్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు భారత్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న దిశా పటాని తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకుంది.

ఈ సందర్బంగా దిశా మాట్లాడుతూ.. సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం ఇక కుదరదేమో అని కుండబద్దలు కొట్టేసింది. ''భవిష్యత్తులో సల్మాన్ ఖాన్ తో కలిసి మళ్లీ నటించడం కుదరదేమో! దానికి కారణం సల్మాన్‌కు నాకు వయసు రిత్యా చాలా వ్యత్యాసం ఉండటమే'' అని చెప్పింది దిశా. ''భారత్ సినిమాలో నాది ట్రాపేజ్ ఆర్టిస్ట్ పాత్ర అని దర్శకుడు అలీ అబ్బాస్ చెప్పడంతో వెంటనే నేను ఒప్పుకోవడం జరిగింది. ఈ సినిమాలో నేను సల్మాన్‌తో కలిసి కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటలో మాత్రమే నేను కనిపిస్తాను. సినిమాలో ఈ పాట వచ్చేటప్పుడు సల్మాన్ 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు కాబట్టి అది ఒప్పుకున్నా. అలాంటప్పుడు నేను ఆయన పక్కన కనిపించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మున్ముందు సల్మాన్ లాంటి పెద్ద వయసు హీరోలతో ఇలాంటి పాత్రలే వస్తాయని చెప్పలేం కదా!. సో ఇదే సల్మాన్‌తో నాకు చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది'' అని దిశా పటాని చెప్పుకొచ్చింది.