TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
హీరోయిన్‌కి చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు.. కొంచెం బుర్ర కూడా వాడు!

హాట్ బ్యూటీ దిశా పటాని తన అందంతో కుర్రకారులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ దిశా పటానికి సినిమాల్లో మాత్రం అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. కనై దిశాపటాని ప్రేమ వ్యవహారాలు, వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. సోషల్ మీడియాలో దిశాపటానిని మిలియన్ల కొద్దీ అభిమానులు ఫాలో అవుతుంటారు. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె అందమే. సోషల్ మీడియాలో దిశా పాటని అందాల ఆరబోతతో ఎలా రెచ్చిపోతుందో అందరికి తెలిసిందే. ఇంస్టాగ్రామ్లో 17 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా సోషల్ మీడియా పోస్ట్ విషయంలో తప్పులో కలిసిన దిశకు నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.
సోషల్ మీడియాతోనే ఎక్కువగా
దిశా పటాని ప్రస్తుతం సినిమాల్లో కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సంపాదిస్తునట్లు ఉంది. యాడ్ ఫోటో షూట్స్ కోసం దిశా మితిమీరిన ఎక్స్ ఫోజింగ్ చేస్తోంది. దిశా అందాల ఆరబోతపై గతంలో విమర్శలు కూడా వచ్చాయి. దీపావళి పర్వదినం రోజున కూడా ఆమె ఓ బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తూ బ్రాతో ఎక్స్ ఫోజింగ్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ సమయంలో దిశాని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసారు.
దారుణమైన పొరపాటు
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఓ మొబైల్ బ్రాండ్ కు ప్రచారం కల్పిస్తూ దిశా పాటని బ్లెండర్ మిస్టేక్ చేసింది. ఆ పోస్ట్ కు క్యాప్షన్ గా మొబైల్ కు సంభంధించిన సమాచారం పెట్టబోయి.. వేరే వీడియోకు సంబందించిన వివరాలు పెట్టింది. పూర్తి వీడియోని త్వరలో పోస్ట్ చేస్తాం.. వేచి చూడండి అని క్యాప్షన్ పెట్టింది. దిశా పటాని తప్పుని గమనించిన నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.
|
కొంచెం బుర్ర వాడు
కాపీ పేస్ట్ చేయడానికి కంట్రోల్ సి, కంట్రోల్ వి తెలిస్తే సరిపోదు కొంచెం బుర్ర కూడా ఉపయోగించాలి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దిశా పటాని త్వరలో కొత్త సోషల్ మీడియా టీంని రిక్రూట్ చేసుకోబోతోంది. ఆసక్తి ఉన్నవారు రెస్యూమ్స్ పంపండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమెకు బుర్ర లేదు అని అర్థం అవుతోంది అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అనుష్క శర్మ కూడా
గతంలో ఇలాంటి చేదు అనుభవం అనుష్క శర్మకు కూడా ఎదురైంది. గూగుల్ ఫోన్ కు ప్రచారం కల్పిస్తూ తన ఐ ఫోన్ నుంచి ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు అనుష్క శర్మని ట్రోల్ చేశారు. ఏది ఏమైనా సోషల్ మీడియా బాగా కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్న హీరోయిన్లలో దిశాపటాని ముందు వరుసలో ఉంటుంది. తనకు ఫోటో షూట్స్ చేసే సమయంలో ఎలాంటి సిగ్గు ఉండదని ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేసింది. చిత్ర పరిశ్రమలో గ్లామర్ షోకు సిద్దపడే రావాలి అని తెలిపింది.