టైగర్ డ్యాన్స్ కు ఫిదా అయిన దిశ
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూనే ఉంటాడు. నెలల తరబడి విరామం తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభవమవుతుండటంతో ఎక్స్‌ట్రా డోస్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్న ఈ కుర్ర హీరో తాజాగా తన డ్యాన్స్‌తో ఫ్యాన్స్ ను మరోసారి ఫిదా చేశాడు. టైగర్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో తన లేటెస్ట్ సాంగ్ "అన్ బిలీవబుల్" పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను షేర్ చేసాడు. ఈ వీడియో చూసిన టైగర్ గర్ల్ ఫ్రెండ్ దిశా పటని షాక్ అయిపోయింది.
తన ఎక్స్ ప్రషన్ ఎమోజీ రూపంలో కామెంట్ చేసింది. దిశా ఒక్కతే కాదు టైగర్ డ్యాన్స్ చూస్తే ప్రతి ఒక్కరి రియాక్షన్ కూడా అదే .. ఆ రేంజ్ లో ఉంది మనోడి డ్యాన్స్ మరి . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. టైగర్ కు దిశా కు మధ్య లవ్ ట్రాక్ నడిచిందని గతం లో చాలా వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఈ ఇద్దరు ఎప్పుడు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి బ్రేక్ అప్ కూడా అయిపోయిందని వినిపించింది. కానీ, తాజా ట్వీట్ తో ఇద్దరి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం అయింది.

ఇక ఫిట్‌నెస్ కు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఈ కండలవీరుడి మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. టైగర్ ప్రస్తుతం "హీరో పంతి 2" చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ బ్లాక్ బస్టర్ మూవీ 'రాంబో' రీమేక్ కూడా చేయబోతున్నాడు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజక్ట్ ఇప్పటికే సెట్లోకి వెళ్లాల్సి ఉండగా, కరోనా ప్రభావంతో 2021 చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











