పండుగరోజు ఇదేం పాడుపని.. హీరోయిన్‌ని ఛీ కొడుతున్న నెటిజన్లు!
అంద చందాలతో యువతకి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది దిశా పటాని. దిశా పటానికి నెటిజన్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ దిశా పటాని క్రేజ్ తగ్గాట్లుగా అవకాశాలు రావడం లేదు. టాలీవుడ్ లో కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే నటించి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఆరంభంలో మాత్రం దిశా అందాలకు బాగా ప్రచారం లభించింది కానీ నెమ్మదిగా అవకాశాలు కరువయ్యాయి. సోషల్ మీడియాలో ఘాటైన ఫోటో షూట్స్ తో నెటిజన్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న దిశా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది.

రూటే సపరేటు
కాంట్రవర్సీ లేకుండా పబ్లిసిటి రాదని గమనించిందో ఏమో కానీ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ మధ్యన దీపావళి సందర్భంగా అందాలు ఆరబోస్తూ చేతిలో దీపం పట్టుకుని అభిమానులు పండుగ శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు.. నెటిజన్లు దిశాపై దుమ్మెత్తి పోశారు. పవిత్రంగా పూజ చేయాల్సిన దీపావళి పర్వదినాన ఇలా అశ్లీలంగా ఇలబడతావా అంటూ విరుచుకుపడ్డారు.
మరోమారు అందాలతో రెచ్చగొడుతూ
తాజాగా దిశా పటాని రెచ్చిపోయింది. పండుగైతే నాకేంటి అన్న చందంగా బికినీ లుక్ లో అదరగొట్టింది. అంతవరకు ఒకే కానీ.. ఈ బికినీ పిక్ ని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసింది. దీనితో అభిమానులు మరోమారు దిశా పటానిని ట్రోల్ చేస్తున్నారు. ఎలాంటి ఏ పనిచేయాలో తెలియదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో
ఇదిలా ఉండగా దిశా పటానికి ప్రేమ వ్యహారాలు కూడా ఉన్నాయి. స్టైలిష్ హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా పటాని ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. బాగి2 చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. పలు సందర్భంలో దిశా, టైగర్ ష్రాఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జంటగా కనిపించారు.

మళ్ళీ టాలీవుడ్‌లోకి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిశా పటాని మాట్లాడుతూ తాను తిరిగి తెలుగులో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వివరించింది. ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు వస్తాయని తెలిపింది. పూరిజగన్నాథ్ దర్శత్వంలో తెరకెక్కిన లోఫర్ చిత్రంతో దిశా పటాని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో దిశా గ్లామర్ కు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా విజయం సాధించలేదు.


Click it and Unblock the Notifications











