బాత్రూంలో లోదుస్తులతో మెగా హీరోయిన్: అసలైనవే కనిపించేలా హాట్ షో
ఇప్పుడున్న పోటీకి సుదీర్ఘ కాలం పాటు స్టార్లుగా రాణించాలంటే ఏ హీరోయిన్‌కు సాధ్యం కాని విషయమే అని చెప్పాలి. కానీ, కొందరు మాత్రం తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్నారు. అందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఒకరు. చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యమ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే దిశా పటానీ తాజాగా ఓ హాట్ పిక్‌ను పంచుకుంది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!

తెలుగులోనే మొదలెట్టింది
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీకి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆ సమయంలోనే ఈ బ్యూటీ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'లోఫర్' సినిమా ద్వారా హీరోయిన్‌గా జర్నీని స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ అమ్మడి ఆరంభంలోనే నిరాశ ఎదరై.. టాలీవుడ్‌కు టాటా చెప్పింది.

ఆ మూవీతో స్టార్‌గా ఎదిగేసి
సినిమాల్లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన దిశా పటానీ కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు బాలీవుడ్‌లో స్టార్‌డమ్ కూడా లభించింది.

వరుస చిత్రాలు.. ప్రభాస్‌తో
చాలా తక్కువ సమయంలోనే హిందీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన దిశా పటానీ.. వరుసగా 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి మూవీలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ 'ప్రాజెక్ట్ K'లో కీలక పాత్రను పోషిస్తోంది. అలాగే, దక్షిణాది చిత్రాల్లోనూ నటించేందుకు ఉత్సహాన్ని చూపిస్తోంది.

హీరోకు బ్రేకప్.. అతడితోనే
తనదైన సినిమాలతో దేశ వ్యాప్తంగా సత్తా చాటుతోన్న దిశా పటానీ.. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణాన్ని సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత బహిరంగంగానే రచ్చ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని.. అలాగే ఆమె తన ఫిట్‌నెస్ ట్రైనర్ అలెగ్జాండర్‌తో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.

అక్కడ మాత్రం యాక్టివ్‌గా
ఏకధాటిగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక అప్‌డేట్ పోస్ట్ చేస్తూనే ఉంటోంది. అందులో తన కెరీర్‌తో పాటు పర్సనల్ విశేషాలను సైతం ఫ్యాన్స్‌తో పంచుకుంటూ క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

హాట్ షోకు కేరాఫ్ అడ్రెస్
సోషల్ మీడియాలో దిశా పటానీ ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. వీటిలో హద్దు దాటేసి మరీ అందాలను చూపిస్తూ హాట్ షోకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. అలాగే తన ప్రియుడితో దిగిన పిక్స్‌ను కూడా వదులుతోంది. తద్వారా ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

బాత్రూం పిక్‌తో అరాచకం
బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్రూంలో లోదుస్తులు మాత్రమే ధరించి సందడి చేస్తోంది. అంతేకాదు, ఘాటు ఫోజుతో అందాలను షో చేస్తోంది. తద్వారా ఆమె బాడీ మొత్తం దర్శనమిస్తోంది. ఫలితంగా ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి.. వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











