Disha Patani: మినీ వైట్ స్కర్ట్‌లో క్వీన్‌లా దిశా పటానీ.. వీడియో వైరల్
తెలుగు ప్రేక్షకులను లోఫర్లుగా మార్చిన బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ. టాలీవుడ్లో ఒకే సినిమాతో మెరిసిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది ఈ సొట్ట బుగ్గల వయ్యారి. నటనతోనే కాకుండా నోళ్లు వెళ్లబెట్టేంత గ్లామర్‌తో ఆడియెన్స్‌ను ఫిదా చేస్తోంది ఈ ఫిట్నెస్ సుందరి. హిందీలో వరుస సినిమాలతో జోరు మీద ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో హాట్ పోజులతో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇటీవల వైట్ డ్రెస్‌లో క్వీన్‌లా మెరిసిపోయింది దిశా పటానీ. తలపై కిరీటం పెట్టుకుని చేసిన వీడియో షూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అంతగా రాని అవకాశాలు..
బాలీవుడ్ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ సరసన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ భామ అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

మోడలింగ్‌తో..
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దిశా పటానీ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి బాగానే రాణించింది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఈ భామ అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అనేక బ్రాండ్స్‌కు అడ్వర్టైజ్మెంట్ చేసింది ఈ బ్యూటీ. ప్రత్యేకంగా ఇంపీరియల్ బ్లూకు చేసిన లిఫ్ట్ యాడ్‌లో చీరకట్టులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది దిశా పటానీ.

లోఫర్‌తో రాని గ్రాండ్ ఎంట్రీ..
ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ లోఫర్ మూవీ ద్వారా తెలుగు తెరకు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ అది అంతగా ఫలించలేదు. దీంతో హీరోయిన్‌గా దిశా పటానీకి గ్రాండ్ ఎంట్రీ సొంతం కాలేదు. ఇక చేసేది లేక టాలీవుడ్లో సినిమాలు చేయలేదు ఈ అమ్మడు.

ధోనీ బయోపిక్‌తో..
ఈ పరిస్థితుల్లోనే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'MS Dhoni' సినిమాతో హిందీలోకి ఎంటరైంది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు దిశాకు మంచి పేరును తీసుకొచ్చింది. ఫలితంగా దిశా పటానీ సినీ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

వరుస ఆఫర్లతో..
ఈ ఒక్క హిట్‌తో చాలా కాలంగా దిశా పటానీకి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే దిశా పటానీకి 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3', 'రాధే' వంటి సినిమాల్లో నటించింది దిశా. ఫలితంగా తన దిశ మారి స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను భారీగా పెంచుకుంది దిశా పటానీ.
స్మాల్ వైట్ స్టర్ట్లో..
ఇక సోషల్ మీడియాలో తన అందచందాలను పరచడంలో దిశాకు ఎవరు సాటి రారు. ఇటీవల దిశా చేసిన వీడియో షూట్ నెటిజన్ల మతిపోగుడుతోంది. టాప్ అండ్ స్మాల్ వైట్ స్కర్ట్‌లో తన స్మైల్, మత్తెక్కించే చూపులతో నిశా తెప్పించేలా ఉంది ఈ ఫిట్నెస్ సుందరి.

టైగర్‌తో డేటింగ్!
ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ చాలా కాలంగా డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు తరచూ పార్టీలు, హాలీడే ట్రిప్లతో రెచ్చిపోతూ తమ ప్రేమను బహిరంగంగానే చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











