అడ్డంగా దొరికిపోయిన సినీ జంట: సీక్రెట్ ప్లేస్‌లో ఆ హీరోతో మెగా హీరోయిన్ ఎంజాయ్.. స్వర్గం అంటూ అలా!
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ప్రేమ కహానీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంత కాలం పాటు ప్రేమించుకోవడం.. ఆ సమయంలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. నచ్చితే పెళ్లి చేసుకోవడం.. లేకుంటే బ్రేకప్‌లు చెప్పుకోవడం.. అక్కడ కనిపించే చాలా సాధారణమైన విషయాలు ఇవి. ఏది ఏమైనా డేటింగులు చేసే తారల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అందులో 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ లవ్ స్టోరీ ఒకటి. చాలా కాలంగా ఆమె హీరో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. తాజాగా వీళ్లు ఓ సీక్రెట్ ప్లేస్‌లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లారు. ఆ సంగతులు మీకోసం!

మెగా హీరో సినిమాతో పరిచయమైంది
మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది దిశా పటానీ. ఇందులో తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె.. యాక్టింగ్ పరంగానూ మెప్పించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బోల్తా పడడంతో దిశాకు నిరాశనే ఎదురైంది.

ధోనీ.. ఆమె జీవితాన్ని మార్చేశాడుగా
ఫస్ట్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఆ వెంటనే వచ్చిన 'ఎమ్ఎస్ ధోనీ' మాత్రం దిశా పటానీకి కెరీర్‌ను నిలబెట్టింది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక ఝా అనే పాత్రను పోషించిందామె. ఇందులో కనిపించేది కొద్ది సమయమే అయినా.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాలే కాదు.. అందులోనూ బిజీనే
'MS Dhoni' తర్వాత దిశా పటానీ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఆ తర్వాత ఆమె వరుసగా జాకీ చాన్ చిత్రం 'కుంగ్‌పూ యోగా', 'వెల్‌కం టు న్యూయార్క్', 'భాగీ 2', 'భారత్', 'మలాంగ్', 'భాగీ 3' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. వీటితో పాటు 'బేఫికర్', 'హర్ గూంట్ మైన్ స్వాగ్' అనే మ్యూజిక్ అల్బమ్‌లలోనూ చేసింది. ప్రస్తుతం సల్మాన్ 'రాధే'లో చేస్తోంది.

ఆ స్టార్ హీరోతో ప్రేమాయణం సాగిస్తూ
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది దిశా పటానీ. ఇందులో భాగంగానే బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది. మొదట్లో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. ఈ మధ్య బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో తరచూ వార్తల్లో నిలుస్తూ బాగా హైలైట్ అవుతున్నారు.

అందులో ఫుల్ బిజీ.. అన్నీ చెబుతూ
వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న దిశా పటానీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే ఎన్నో గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇక, ఆమె తరచూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు నిర్వహిస్తోంది. తాజాగా రెండు రోజుల క్రితమే ఫ్యాన్స్‌తో మరోసారి చాట్ నిర్వహించింది.

అతడితో కలిసి మాల్దీవులు చెక్కేసింది
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తరచూ తన ప్రియుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుంది దిశా పటానీ. వీకెండ్‌లను కలిసి జరుపుకోవడం.. సీక్రెట్ మీటింగులు పెట్టుకోవడం వంటి వాటితో తెగ హాట్ టాపిక్ అవుతోందామె. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టైగర్‌తో కలిసి మాల్దీవులు వెళ్లింది దిశా పటానీ. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

స్వర్గం అంటూ పోస్ట్ పెట్టడంతో హైలైట్
ఆదివారం ముంబై ఎయిర్‌పోర్టుకు విడివిడిగా వచ్చిన దిశ పటానీ, టైగర్ ష్రాఫ్.. ఒకే విమానంలో మాల్దీవులు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ మాత్రం వీళ్లిద్దరూ జంటగానే ఉన్నారని సమాచారం. ఇక, తాను మాల్దీవుల్లో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు, ఓ వీడియోను పోస్ట్ చేసి 'స్వర్గం' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ సీక్రెట్ టూర్ బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











