బెడ్ చూస్తే.. మూడ్ వస్తోందంటోన్న హాట్ భామ
దిషా పఠానీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోయేలా చేస్తుంది దిషా పఠానీ. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దిషా.. అటుపై బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన బాఘీ2 చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం..
ఈ భామ టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోందని బీ టౌన్ మొత్తం ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నదేంటో బయట పెట్టడానికి వారు ఇష్టపడలేదు. పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతోన్నట్లు కూడా టాక్ వినిపించింది. అయితే అంతలోనే ఏమైందో ఏమో గానీ, తామిద్దరం మంచి స్నేహితులమేనంటూ మాట మార్చేశారు. మరి వీరి బంధం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

తాజాగా భారత్ చిత్రంలో మెరిసిన దిషా..
సల్మాన్ ఖాన్ నటించిన భారత్ చిత్రంలో దిషా పఠానీ మెరిసింది. సల్లూ భాయ్ తో కలిసి వేసిన స్టెప్పులు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. భారత్ చిత్రంలో మల్లెతీగలా నాజూగ్గా ఉన్న దిషా.. అందాలకు అందరూ ఫిదా అయ్యారు.

కెవిన్ కెల్విన్ బ్రాండ్ లో దుస్తులతో ఫేమస్..
కెవిన్ కెల్విన్ లో దుస్తులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో ఇటు కెవిన్ కెల్విన్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. తన ఫాలోయింగ్ ను కూడా పెంచేసుకుంటుంది ఈ భామ. దిషా పఠానీని ఆమె అభిమానులు కెవిన్ కెల్విన్ భామ అని ముద్దుగా పిలుచుకుంటారు.

తాజాగా వచ్చిన యాడ్ వైరల్..
సినిమాలే కాకుండా.. ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తోంది. బెడ్ ను చూస్తే మూడ్ వస్తోందంటూ వచ్చిన ఈ ప్రకటన వైరల్ అవుతోంది. బెడ్ ను చూస్తే ఆగలేకపోతున్నట్లు.. వెంటనే వాటిపై పడిపోతుండటం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ యాడ్ కు సంబంధించిన వీడయో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











