ఇక్కడ సిగ్గు వదిలేయాలి.. నేను కెమెరా ముందుకు వస్తే.. దిశా పటాని!
తెలుగులో లోఫర్ అనే ఏకైక చిత్రంలో నటించింది దిశా పటాని. ఈ చిత్రం నిరాశ పరచడంతో కనుమరుగైపోయింది. క్రమంగా బాలీవుడ్ చిత్రాలలో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తరచుగా అవకాశాలు అందుకుంటూ క్రేజ్ సంపాదించుకుంది. దిశా పటాని అందానికి యువతలో మంచి క్రేజ్ ఉంది. నాజూకైన సొగసుతో దిశాపటాని అందాలు ఆరబోస్తోంది. ఇక ఫోటో షూట్స్ లో అయితే దిశాపటాని గురించి ఎంత చెప్పినా తక్కువే. దిశా పటాని చేసే ఘాటైన ఫోటోషూట్స్ తో పలు మార్లు సోషల్ మీడియాలో దుమారం రేగింది. తనపై వస్తున్న విమర్శలకు దిశా పటాని తాజాగా స్పందించింది.

అందం ఉన్నా వర్కౌట్ కాలేదు
చాలా మంది హీరోయిన్లు అందం, అభినయం ఉన్న సరిగా రాణించలేరు. దానికి కారణం కెరీర్ లో ప్లానింగ్ లేకపోవడమే. దిశాపటాని కూడా అదే కోవకు చెందుతుంది. తెలుగులో నటించిన తొలి చిత్రం ప్లాప్ కాగానే బాలీవుడ్ గూటికి చేరిపోయింది. అక్కడ తీవ్రమైన పోటీని తట్టుకోలేక వెనుకబడిపోయింది. దిశాపటానికి బాలీవుడ్ లో అరా కోరా అవకాశాలు మాత్రమే దక్కుతున్నాయి. అందుకే ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

తీవ్రమైన విమర్శలు
దిశా పాటని చేస్తున్న ఘాటైన ఫోటో షూట్స్ పై తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ మధ్యన దీపావళి సందర్భంగా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ పూజ చేయడం దిశా పటాని పై విమర్శలు ఎక్కువయ్యేలా చేసింది. బికినిలో అందాలు ఏమాత్రం దాచుకోకుండా ఫోటో షాట్స్ చేయడం వలన కూడా దిశాపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీని గురించి ప్రశ్నించగా తాను ఉంటున్నది గ్లామర్ ఫీల్డ్ లో అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సిగ్గు వదిలేయాలి
హీరోయిన్‌గా మనకి మనం ప్రచారం కల్పించుకోవాలంటే ఫోటో షూట్స్ తప్పని సరిగా చేయాలి అని దిశా పటాని తెలిపింది. ఫోటో షూట్స్ అంటే గ్లామర్ తో కూడుకున్నవే. ఫోటో షూట్స్ ని ఆ కోణంలోనే చూడాలి అని దిశా తెలిపింది. నేను చేస్తున్న ఫోటో షూట్స్ పై విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏమాత్రం సిగ్గు ఉండకుండదు. నేను కెమెరా ముందుకు వెళితే నా చుట్టూ ఎవరున్నారు అని పట్టించుకోను.. కనీసం కెమెరా మెన్‌ని కూడా పట్టించుకోను అని తెలిపింది.

త్వరలోనే తెలుగు చిత్రం
కెమెరా ముందుకు వెళ్లి గ్లామర్ షో చేయాలంటే సిగ్గులేకుండా చేయగలిగేవాళ్ళే ఈ ఫీల్డ్‌కి రావాలని దిశాపటాని తెలిపింది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్ళు ఈ ఫీల్డ్ లోకే రాకూడదని దిశా పటాని తెలిపింది. నా వృత్తిలో భాగంగానే ఫోటో షూట్స్ చేస్తున్నానని దిశా తెలిపింది. డీలా ఉండగా తాను త్వరలోనే ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు కూడా దిశా వెల్లడించింది. ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయట.


Click it and Unblock the Notifications











