బర్త్ డే బేబీ దిశా పటానీ.. ఈరోజు కూడా వదలకుండా బీచ్ లో బికినీతో హాట్ ట్రీట్!

ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉండే దిశా పటాని బర్త్ డే ఈరోజు. సరిగ్గా పుట్టిన రోజు నాడే మరో హాట్ ఫోటో షేర్ చేసి మళ్లీ వార్తల్లోకెక్కింది. బీచ్ ఒడ్డున బికినీతో కూర్చుని రచ్చ చేస్తున్న ఒక ఫోటోను ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది..హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆ ఫోటోకి బర్త్ డే విషెస్ తో పాటు హాట్ నెస్ గురించిన కామెంట్ల వర్షం కురుస్తోంది.

 లోఫర్ తో ఎంట్రీ

లోఫర్ తో ఎంట్రీ

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని తక్కువ సమయంలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో అవకాశం దక్కడంతో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ భామ యాక్టింగ్ పరంగా కూడా అలరించింది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంది.

సోషల్ మీడియా స్టార్

సోషల్ మీడియా స్టార్

అయితే బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ చేతినిండా సినిమాలు ఉన్నా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కనీసం వారానికి ఒక్కసారైనా బికినీ ఫోటో లేదా ఒక మాంచి హాట్ ఫోటో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి ఫోటోలు కాకపోయినా ఎప్పటివో తీసుకువచ్చి త్రో బాక్ పేరుతొ షేర్ చేసి ఆమె అభిమానులను అలరిస్తుంది.

 చేతినిండా సినిమాలు

చేతినిండా సినిమాలు

ప్రస్తుతం ఈ భామ చేతిలో మొత్తం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి అని అంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ భామ ఇంస్టాగ్రామ్ లో అయితే ఏకంగా నలభై నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుని రచ్చ చేస్తోంది. అన్నట్టు బాలీవుడ్ లో సూపర్ స్టార్ హోదా దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న టైగర్ ష్రాఫ్ తో ఈ భామ ప్రేమలో పడింది.

టైగర్ తో లవ్

టైగర్ తో లవ్

ముందుగా ఈ ఇద్దరూ కలిసి భాగీ 2 అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నాళ్ళ పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించారు. అనేక సందర్భాల్లో ఫోటోలు సైతం బయటకు వచ్చినా వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా ఎప్పుడూ తమ ప్రేమ బంధాన్ని ఒప్పుకున్నది లేదు.

లాక్ డౌన్ లో కేస్ కూడా

లాక్ డౌన్ లో కేస్ కూడా

అయితే వీరిద్దరూ తాజాగా లాక్ డౌన్ లో వీళ్ళిద్దరూ కలిసి ముంబై పోలీసులకు చిక్కడం, పోలీసులు ఫైన్ కూడా వేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ భామ తాజాగా షేర్ చేసిన బికినీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీచ్ ఒడ్డున పింక్ బికినీలో కూర్చున్న ఆమె ఒక పువ్వు సింబల్ పెట్టి దానిని షేర్ చేసింది.

అన్నీ లవ్ సింబల్సే

అన్నీ లవ్ సింబల్సే

ఇక బికినీతో ఉన్న ఆమె షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆమె ఫోటోకి పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వెల్లువలా వచ్చిపడుతున్నాయి. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ ఫోటోకి అన్నీ లవ్ సింబల్స్ కామెంట్స్ రావడం మొదలయ్యాయి. మరి ఇంకెందుకు ఆలస్యం బర్త్ డే బేబీ బికినీ పిక్ మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X