Pushpa The Rule: పుష్ప 2లో పాన్ ఇండియా హీరోయిన్.. సమంతను మించిపోయేలా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, అన్నింటికీ మించి స్టైల్స్ చూపిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అయితే, ఆ మధ్యన సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డ అతడు.. ఇప్పుడు వరుస హిట్లతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే 'పుష్ప ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన 'పుష్ప ది రైజ్' మూవీ సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్'కు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న స్టోరీలైన్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు హై లెవెల్‌లోనే ఏర్పడ్డాయి.

పాన్ ఇండియా రేంజ్ మూవీగా రాబోతున్న 'పుష్ప ది రూల్'కు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసేశారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నారు.
మాస్ అండ్ యాక్షన్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'పుష్ప 2' కోసం పాన్ ఇండియా హీరోయిన్ దిశా పటానీని ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

'పుష్ప ది రైజ్' మూవీలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 'పుష్ప ది రూల్'లో దానికి మించిన సాంగ్‌ను పెట్టబోతున్నారట. దీనికోసమే దిశా పటానీని తీసుకున్నారని తెలిసింది. ఆమె త్వరలోనే ఈ సాంగ్ షూట్‌లో పాల్గొనబోతుందట. సినిమా సెకెండాఫ్‌లో వచ్చే ఈ పాట థియేటర్లు దద్దరిల్లేలా ఉంటుందని టాక్.
ఇదిలా ఉండగా.. 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











