Don't Miss!
- Sports
INDvsNZ : స్కైకి ఆకాశమే హద్దు.. సూపర్ స్టార్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
- News
హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో మరో భారీ అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది!!
- Finance
pan: 'పాన్'కు పట్టం కట్టిన కేంద్రం.. ఇకపై వాటన్నిటికీ బదులు పాన్ ఒక్కటి చాలు !
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samantha కంటే ఘాటుగా రెచ్చిపోయిన దిశా పటాని.. ఊ అంటావా అంటూ అందాల ఆరబోత
సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ అప్పుడప్పుడు వేసే స్టెప్పులు మాత్రం ఊహించని విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఒకరు చేసిన పాటలకు మరొకరు డ్యాన్స్ స్టెప్పులు వేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటారు.
ఇక పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయిందో అదే తరహాలో సినిమా సెలబ్రిటీల చేత కూడా ఆ పాట స్టెప్పులు వేయించింది. ఇక రీసెంట్ గా దిశాపటాని కూడా సమంత కంటే ఘాటైన స్టెప్పులతో షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో బిజీగా..
లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దిశపటాని ఆ తర్వాత మళ్లీ ఎందుకో తెలుగులో పెద్దగా అవకాశాలు అందుకోలేదు. వీలైనంతవరకు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తోంది. అక్కడ ఈ బ్యూటీకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు దక్కుతున్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది.

అందరిని ఆకట్టుకునేలా..
దిశ పటాని కేవలం సినిమాలతోనే కాకుండా తన గ్లామరస్ అందాలతో కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్పెషల్ ఈవెంట్స్ లో కూడా తన డాన్స్ స్టెప్పులతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బికినీలో కూడా చాలాసార్లు ఈ బ్యూటీ షాక్ ఇచ్చేలా దర్శనమిచ్చింది.

పుష్ప ఐటెమ్ సాంగ్ స్టెప్పులు
పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో ఊ అంటావా మామా అనే ఐటెం సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందులో సమంత స్టెప్పులతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కేవలం తెలుగు ఆడియోన్స్ మాత్రమే కాకుండా నార్త్ ఇండియన్స్ కూడా ఆ పాటను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక అదే పాటను చాలామంది సినిమా సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యారు. ఇక దిశా కూడా ఆ పాటకు స్టెప్పులు చేసింది.

ఘాటైన స్టెప్పులు
రీసెంట్ గా దిశపటాని ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. గతంలో కూడా ఆమె కొన్నిసార్లు ఈ పాటకు స్టెప్పులు వేసింది. కానీ ఈసారి ఒక వేడుకలో మాత్రం ఫాన్స్ గుండెల్లోకి గుచ్చుకునేలా స్టెప్పులతో అలరించింది. ఊ అంటావా.. అనే పాటకు ఆమె గ్లామర్ మరింత హైలెట్ అయ్యే విధంగా హావభావాలు చూపించింది. ఇంతకంటే ఘాటైన స్టెప్పులు మరొకటి ఉండవని కూడా నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు.
|
ఆ వేడుకల్లో ఇలా డ్యాన్స్
దిశాపటాని ఎలాంటి పాటకు డాన్స్ చేసిన కూడా అది వైరల్ అవ్వాల్సిందే అని మరోసారి పుష్ప పాటతో రుజువు చేసింది. ఇక ఈ బ్యూటీకి సంబంధించిన ఆ వీడియో ఎక్కడిది అనే వివరాల్లోకి వెళితే హాకీ వరల్డ్ కప్ కు సంబంధించిన ఈవెంట్స్ లలోని పలు కార్యక్రమాలలో భాగంగా దిశాపటాని స్టేజిపై ఈ స్టెప్పులు వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె స్టెప్పులు వేసిన విధానానికి చాలామంది నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.