దిశ సలియాన్ మృతి మరిన్ని అనుమానాలు.. భిన్న కథనాలతో మళ్లీ గందరగోళం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ మరణం విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలోను, పోలీసుల స్టేట్‌మెంట్స్‌లో వెలుగు చూస్తున్న విషయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. పోలీసులు చెబుతున్న విషయాలకు, మీడియా వెల్లడిస్తున్న రిపోర్టులకు ఎలాంటి పొంతన కుదరడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి దిశ సలియాన్ మృతి విషయం చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించి తాజాగా వెలుగు చూసిన విషయాలు..

దిశ సలియాన్ నగ్నంగా లేదు..

దిశ సలియాన్ నగ్నంగా లేదు..

దిశ సలియాన్ మరణించినప్పుడు ఆమె ఒంటిపై బట్టలు లేవు. ఆమె దేహంపై రక్తపు మరకలు, గాయాలు ఉన్నాయనే విషయం రిపబ్లిక్ టెలివిజన్ ఛానెల్ కథనంలో వెల్లడించింది. అయితే చానెల్ వెల్లడించిన సమాచారంపై ముంబై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిశ సలియాన్ ఒంటిపై బట్టలు లేవనే వార్తల్లో వాస్తవం లేదు అని పోలీసులు పేర్కొన్నారు.

దిశ స్నేహితులే తరలించారు

దిశ స్నేహితులే తరలించారు

జూన్ 8వ తేదీ అర్ధరాత్రి దిశ సలియాన్ మరణించినట్టు చెబుతున్న సంఘటనా స్థలం వద్ద సెక్యూరిటీ సూపర్ వైజర్ భిన్న కథనాన్ని వినిపించారు. దిశ సలియాన్ మరణించినప్పుడు ఆమె స్నేహితులే హాస్పిటల్‌కు తరలించారు అని తెలిపారు. దిశను పోలీసులు తరలించలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

దిశ సలియాన్‌ను హాస్పిటల్‌కు తరలించిన తర్వాతే పోలీసుల

దిశ సలియాన్‌ను హాస్పిటల్‌కు తరలించిన తర్వాతే పోలీసుల

దిశ దేహాన్ని ఆమె కాబోయే భర్త రోహన్ రాయ్ తన స్నేహితులతో కలిసి హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకోవడానికి ముందే ఆమెను తీసుకెళ్లారు. రోహన్ కూడా తన కారును బయటకు తీశారు. అప్పుడు పోలీసులు వచ్చి దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై విచారించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. దిశ దేహాన్ని వారు తీసుకెళ్లలేదు అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

దిశ సలియాన్‌ అంబులెన్సులో తరలించలేదు

దిశ సలియాన్‌ అంబులెన్సులో తరలించలేదు

దిశ సలియాన్ దేహాన్ని అంబులెన్సులో తరలించలేదు. ఆమెను ప్రైవేట్ వాహనంలో తరలించారు. మార్గమధ్యంలో ఏం జరిగిందో తెలియదు. వారు అంబులెన్సులోకి మార్చారా? అనే విషయంపై నాకు తెలియదు. మా అపార్ట్‌మెంట్ నుంచి దిశ సలియాన్‌ను మాత్రం రెడ్ కారులో తరలించారు అని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
దిశ మరణం తర్వాత మళ్లీ కనిపించలేదు

దిశ మరణం తర్వాత మళ్లీ కనిపించలేదు

దిశ దేహాన్ని హాస్పిటల్‌కు తరలించిన తర్వాత ఆ రోజు తెల్లవారు జామున రోహన్ రాయ్ వచ్చారు. ఆ తర్వాత గత 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు కనిపించలేదు. మా సెక్యూరిటీ సిబ్బంది కూడా అదే విషయాన్ని తెలిపారు అని దిశ సలియాన్ ఉండే అపార్ట్‌మెంట్ సెక్యూరిటి సూపర్‌వైజర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X