దిశ సలియాన్‌ను చంపేశారా?.. నమ్మిన వాళ్లే సుశాంత్‌కు ద్రోహం.. స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు

సుశాంత్ సింగ్ రాజ్‌ మరణానికి దిశ సలియాన్ అనుమానాస్పద మృతి కారణం అంటూ ఆయన సిబ్బంది సంచలన విషయాలు బయటపెట్టారు. రిపబ్లిక్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో దిశ మరణానికి ముందు, తర్వాత చోటుచేసుకొన్న విషయాలను సుశాంత్ సిబ్బంది వెల్లడించిన విషయాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించిన విషయాలు ఏమింటే..

పెంట్‌హౌస్‌కు రమ్మని బలవంతం

పెంట్‌హౌస్‌కు రమ్మని బలవంతం

జూలై 8వ తేదీన దిశ సలియాన్‌ ఓ పార్టీకి వెళ్లింది. ఆ పార్టీలో కొందరు రాజకీయ నేతలు, సినిమా స్టార్లు పాల్గొన్నారు. ఆ పార్టీ జరుగుతున్న భవనంలోని పెంట్ హౌస్‌కి రమ్మని కొందరు దిశ సలియాన్‌ను బలవంతం చేశారు. ఆ విషయంలో నిరాకరించడంతో ఆమెను బెదిరించారు. ఆ సమయంలో అక్కడి నుంచి సుశాంత్‌కు దిశ కాల్ చేసింది. ఆ ప్రదేశం నుంచి బయటపడమని దిశాకు సూచించారు అని సుశాంత్ సిబ్బంది వెల్లడించాడు.

సుశాంత్‌తో మాట్లాడిన గంటలోపే దిశ మరణం

సుశాంత్‌తో మాట్లాడిన గంటలోపే దిశ మరణం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో మాట్లాడిన గంటలోపే దిశ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆ విషయంతో తీవ్ర షాక్ గురైన సుశాంత్.. దిశ మరణం వెనుక కారణాలను మీడియాకు వెల్లడించానికి సిద్ధపడ్డారు. ఆ విషయాన్ని తన స్నేహితుడు సందీప్ సింగ్‌కు చెప్పాడు. సందీప్‌కు సుశాంత్ చెప్పడం మోసం జరిగింది. ఆ పార్టీలో పాల్గొన్న ప్రముఖులకు సందీప్ ఈ వార్తను చేరవేశాడు. దాంతో సుశాంత్‌కు ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అనే విషయాన్ని సిబ్బంది పూసగుచ్చినట్టు చెప్పాడు.

సందీప్‌కు చెప్పకుండా ఉంటే సుశాంత్ బతికి ఉండే వారు

సందీప్‌కు చెప్పకుండా ఉంటే సుశాంత్ బతికి ఉండే వారు

సందీప్ సింగ్‌కు ప్రెస్ మీట్ విషయాలను చెప్పకుండా ఉండి ఉంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బతికి ఉండేవారు. సందీప్ సింగ్‌కు ఆ విషయాన్ని చెప్పడమే ఆయన చేసిన తప్పు. తన పక్కన ఉంటూ కొందరు సుశాంత్‌కు నమ్మక ద్రోహం చేశారు. సందీప్ సింగ్‌ను విచారిస్తే అసలు విషయాలు బయటపడుతాయి అని సుశాంత్ సింగ్ పని మనిషి వెల్లడించారు.

దిశ మరణం తర్వాత 6 సిమ్‌కార్డులు మార్చిన సుశాంత్

దిశ మరణం తర్వాత 6 సిమ్‌కార్డులు మార్చిన సుశాంత్

దిశ సలియాన్ మరణం తర్వాత సుశాంత్ సింగ్ తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. జూన్ 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు 50 సిమ్ కార్డులు మార్చారు. గత 4 సంవత్సరాల్లో సుశాంత్ ఒకే సిమ్ కార్డు మార్చారు. కానీ ఆరు రోజుల్లోనే 50 సిమ్ కార్డులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సుశాంత్ సిబ్బంది స్టింగ్ ఆపరేషన్లో పేర్కొన్నారు.

దిశ సలియాన్‌ది సూసైడ్ కాదా?

దిశ సలియాన్‌ది సూసైడ్ కాదా?

సుశాంత్ సింగ్ సిబ్బంది స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడించిన సమాచారం ప్రకారం.. దిశ సలియాన్‌ది ఆత్మహత్య కాదు. ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ పార్టీలో ఆమెపై ఒత్తిడి చేసిన వ్యక్తులు ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ పార్టీలో ఎవరెవరూ ఉన్నారనే విషయాలను ముంబై పోలీసులు బయటపెడితే గుట్టంత బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X