సూరజ్‌ పంచోలితో గర్భం.. ఆ లోకంలోనైనా ప్రశాంతంగా బతకనివ్వండి.. దిశా ఫ్యామిలీ ఆవేదన

ఐశ్వర్యరాయ్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాంటి తారలకు మేనేజర్‌గా పనిచేసిన దిశా సలియాన్ సూసైడ్ వ్యవహారం వివాదంగా మారుతున్నది. బాలీవుడ్ యువ హీరో సూరజ్ పంచోలి కారణంగా ఆమె గర్బవతి అయిందని, ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఊపందుకొన్నాయి. అయితే ఇలాంటి వార్తలను ప్రచారం చేయకూడదంటూ దిశా సలియాన్ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగమైన అంశాలను ప్రస్తావిస్తూ..

బాధను పంచుకోండి.. రూమర్లొద్దు

బాధను పంచుకోండి.. రూమర్లొద్దు

దిశా సలియాన్ కుటుంబ సభ్యులు విడుదల చేసిన లేఖలో.. మీకు మేము గానీ, దిశ గానీ వ్యక్తిగతంగా తెలియకపోవచ్చు. కానీ అందరిలో ఓ కామన్ అంశం ఉంది. ఏదైనా జరగకూడదనిది జరిగితే భావోద్వేగానికి గురయ్యే మానవులం మనమంతా. అందుకే మీరంతా మా బాధను అర్ధం చేసుకొంటున్నారు. బాధను పంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మా కుటుంబంలో మాకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాం. అలాంటి విషాదం నుంచి ఇలాంటి వార్తలు మమల్ని ఇంకా కోలుకోలేకుండా చేస్తున్నది అని దిశా సలియాన్ కుటుంబ సభ్యులు లేఖలో పేర్కొన్నారు.

 రూమర్లతో మరింత బాధ

రూమర్లతో మరింత బాధ

దిశా మరణం నుంచి మేము ఇంకా బయటపడలేకపోతున్నాం. ఆ బాధ నుంచి బయటకు రాకముందే దిశాపై వస్తున్న రూమర్లు మరింత కుంగదీసేలా చేశాయి. ఆమె మరణం వెనుక కుట్రపూరితమైన ఆలోచనలు, ఊహాగానాలు మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నాయి. అలాంటి వార్తల్లో వాస్తవం లేదు. అంతేగాకుండా ఆమె తల్లిదండ్రులను, సన్నిహితులను ఆవేదనకు గురిచేస్తున్నాయి అని కుటుంబ సభ్యులు లేఖలో వెల్లడించారు.

ఒకరి ప్రయోజనం కోసం రూమర్లోద్దు

ఒకరి ప్రయోజనం కోసం రూమర్లోద్దు

దిశా మరణంతో విషాదంలో ఉన్న మాకు ఊరట కలిగించేలా వ్యవహరించండి. అంతేగానీ ఒకరి వినోదం కోసమో లేదా.. కొందరి ప్రయోజనాల కోసమో సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేయకండి. దిశా ఒకరి కూతురనో లేదా సోదరి అనో విషయాన్ని గుర్తుంచుకోండి. వారికి కొన్ని మనోభావాలు ఉంటాయనే విషయాన్ని గ్రహించండి. మీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే ఇలానే వ్యవహరిస్తారా? దిశా కుటుంబ సభ్యులు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా ప్రశాంతంగా బతకనివ్వండి

ఇకనైనా ప్రశాంతంగా బతకనివ్వండి

ఉదారత, మానవత్వం అనే మనుషుల్లో ఉండే బేసిక్ క్వాలీటీస్. మనమంతా మనుషులమనే విషయాన్ని మరిచిపోవద్దు. సలియాని ఈ లోకం లేదు. కనీసం ఏ లోకాల్లో ఉన్న ప్రశాంతంగా ఉండనివ్వండి. మరొకరితో సంబంధాలు అంటగట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూరుకుండా ప్రయత్నించకండి. దయచేసి ఆమెపై రూమర్లు, ఊహాగానాలు ఆపండి అంటూ కుటుంబ సభ్యులు తమ లేఖలో బాధను చెప్పుకొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput: Netizens Demands Be Fair In Sushant Case| #BeFairInSSRCase
సూరజ్‌తో దిశా సలియాన్‌కు గర్భం అంటూ

సూరజ్‌తో దిశా సలియాన్‌కు గర్భం అంటూ

గత కొద్దిరోజులుగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు దిశా సలియాన్ సూసైడ్ కారణమంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. దిశ సలియాన్‌తో సూరజ్ పంచోలికి ఉన్న అఫైర్ కారణంగానే ఆమె మరణించింది. ఆ వ్యవహారంలో గొడవ జరగడమే సుశాంత్ సింగ్ మరణానికి కారణమైందని పలువురు ట్వీట్లు చేస్తూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ చేశారు. ఈ క్రమంలో సూరజ్ పంచోలితోపాటు, దిశా సలియాన్ కుటుంబ సభ్యులు స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X