సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ సంచలన నిర్ణయం.. అర్ధరాత్రి దిశా సలియాన్ భర్తను..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొద్దికాలంగా నెమ్మదించినదనే విమర్శల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అధికారులు దూకుడు ప్రదర్శించారు. పలు విమర్శలకు తెర దించుతూ దిశా సలియాన్ కాబోయే భర్త రోహన్ రాయ్‌ని బుధవారం అర్ధరాత్రి విచారించడంతో మరోసారి ఈ కేసు విచారణ చర్చనీయాంశమైంది. దిశ సూసైడ్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సీబీఐ అధికారులు సేకరించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. దిశా కేసులో సీబీఐ విచారణకు సంబంధించిన మరింత సమాచారం ఏమిటంటే..

14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
సుశాంత్ సింగ్ మరణానికి ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సలియాన్ అనూహ్యమైన రీతిలో జూన్ 8వ తేదీన మల్లాడ్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నారు. దిశ సూసైడ్ సమయంలో కాబోయే భర్త రోహన్ రాయ్ ఆమెతోనే ఉన్నారు. ఆ దుర్ఘటన తర్వాత రోహన్ ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇటీవల పూణెలో ఉన్నట్టు పలు టెలివిజన్ ఛానెల్స్ రిపోర్టు చేశాయి.

ఆత్మహత్యకు ముందు ఉత్సాహంగా కాబోయే భర్తతో పార్టీ
అయితే దిశ సలియాన్ సూసైడ్‌కు కొద్ది గంటల ముందు ఆమె తన కాబోయే భర్త, మరికొంత మంది స్నేహితులతో ఉత్సాహంగా పార్టీ చేసుకొంటూ కనిపించారు. ఆ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన మరణానికి కొద్ది గంటల ముందు ఆనందంగా ఉన్న దిశ సూసైడ్‌కు ఎందుకు ప్రయత్నించారనే అంశం అనేక అనుమానాలు తావిచ్చింది. బీజేపీ నేత నితేష్ రానే స్పందిస్తూ దిశాది హత్యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్నేహితులతో పార్టీకి ముందు మరో పార్టీలో దిశ సలియాన్
దిశ సూసైడ్‌కు ముందు అదే రోజు ముంబైలో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నారు. అక్కడ కొందరు రాజకీయ ప్రముఖులు, సినీతారలు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన గొడవ తర్వాత అక్కడి నుంచే సుశాంత్‌కు దిశ సలియాన్ ఫోన్ చేశారు. ఆ తర్వాత దిశాను అక్కడి నుంచి వెళ్లి రమ్మని చేసిన సుశాంత్ సూచన మేరకు ఆమె తన ఇంటికి చేరుకొన్నారు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో దిశా మరణించారనే విషయాన్ని జాతీయ మీడియా తమ కథనాల్లో వెల్లడించింది.

దిశ మరణం తర్వాత సుశాంత్ సింగ్ సూసైడ్
దిశ సలియాన్ మరణం తర్వాత కొద్ది రోజులకే సుశాంత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నారు. అయితే దిశ మరణానికి, సుశాంత్ మృతికి ఏదో సంబంధం ఉందనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే దిశా సలియాన్ కాబోయే భర్తను సీబీఐ బుధవారం అర్ధరాత్రి గంటసేపు విచారించింది అని జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.
Recommended Video

దిశా సలియాన్ కాబోయే భర్తను ప్రశ్నించిన సీబీఐ
అయితే దిశ కేసుతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ముడిపడి ఉందనే ఆరోపణల నేపథ్యంలో రోహన్ రాయ్‌ని బుధవారం గంట సేపు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మల్లాడ్‌లోని రోహన్ నివాసానికి ఐదుగురు అధికారులు రాత్రి 10 గంటల సమయంలో వెళ్లి విచారించారు. అయితే రోహన్ ప్రశ్నించేందుకు వెళ్లిన సమయంలో తమ సెక్యూరిటీకి కూడా సమాచారం ఇవ్వకుండా సీక్రెట్‌గా వెళ్లి విచారించారనే విషయం బయటకు వచ్చింది. ఈ దర్యాప్తు విషయంపై అధికారులు పెదవి విప్పడం లేదనే తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











