లింగ మార్పిడితో స్త్రీగా మారాను, మా పెళ్లి చెల్లుతుంది.. నటి విడాకుల పోరాటం!
హిందీ టీవీ నటి బాబీ డార్లింగ్ తన భర్త రమ్నిక్ శర్మతో విడాకులు కావాలంటూ కేసు వేసింది. అతడు తనను చిత్ర హింసలు పెడుతున్నాడని, కలిసి జీవించలేనని చెబుతోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. రమ్నిక్ శర్మ వాదన మరోలా ఉంది. నేను మహిళను పెళ్లాడలేదు. అందు వల్ల ఈ వివాహం చెల్లదు అని వాదిస్తున్నాడు.
వివారాల్లోకి వెళితే... ఇప్పుడు మహిళగా ఉన్న బాబీ డార్లింగ్ కొన్ని రోజుల ముందు పంకజ్ అనే పురుషుడు. లింగ మార్పిడి చేసుకుని స్త్రీగా మారాడు. తర్వాత బాబీ డార్లింగ్, రమ్నిక్ శర్మ వివాహం జరిగింది. అన్నీ తెలిసే అతడు పెళ్లి చేసుకున్నాడు. అయితే బాబీ డార్లింగ్ విడాకుల కోసం కోర్టుకెక్కడంతో రమ్నిక్ కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. తాను మహిళను పెళ్లాడలేదు కాబట్టి ఈ వివాహం చెల్లదు, అలాంటపుడు విడాకుల అవసరం ఏమిటి? అంటూ వాదిస్తున్నాడు.

మా పెళ్లి చెల్లుతుంది
అయితే రమ్నిక్ వాదనను బాబీ డార్లింగ్ తప్పుబట్టారు. లింగ మార్పిడి తర్వాత తాను మహిళగా మారాను. సమాజం కూడా నన్ను స్త్రీగా గుర్తించింది, నేను మహిళలగా మారాను కాబట్టే రమ్నిక్ వివాహం చేసుకున్నాడు. అందు వల్ల ఈ వివాహం చెల్లుతుందని స్పష్టం చేశారు.

అతడి వద్దే తన ఆస్తులు
2016లో బాబీ డార్లింగ్, రమ్నిక్ శర్మ వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య విబేధాలు తీవ్రం అయ్యాయి. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న బాబీ డార్లింగ్... రమ్నిక్ వద్ద ఇరుక్కుపోయిన తన ఆస్తులను దక్కించుకోవడానికి కోర్టుకెక్కారు.

నా డబ్బుతో కొన్నవే
అతడికి గిఫ్టుగా ఇచ్చిన ముంబైలోని ఫ్లాట్ తనకు తిరిగి చెందేలా చేయాలని, భూపాల్‌లో తమ ఇద్దరి పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తి కూడా తనకే దక్కాలని, అది నా డబ్బుతోనే కొనుగోలు చేశామని తన లాయర్ ద్వారా బాబీ డార్లింగ్ పోరాటం చేస్తోంది.

వింతగా పరిశీలిస్తున్న ప్రేక్షకులు
బాబీ డార్లింగ్, రమ్నిక్ శర్మ విడాకుల గొడవ సర్వాత్రా హాట్ టాపిక్ అయింది. ఇలాంటి వ్యవహారం గతంలో ఎన్నుడూ చూడని ప్రేక్షకులు ఈ కేసు చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుందో? కోర్టు నుంచి ఎలాంటి స్పందద వస్తుందో అని ఆసక్తిగా చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











