ఐశ్వర్యతో విడాకులు.. ఆరాధ్య రియాక్షన్ ఏంటి? అభిషేక్ ఏం చెప్పారంటే?
బాలీవుడ్‌లో విడాకుల వివాదాలు జోరుగా వినిపిస్తూనే ఉన్నాయి. పలువురు సినీ దంపతుల జీవితాల్లో విభేదాల కారణంగా డైవోర్స్ వార్తలు మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో హిందీ సినిమా పరిశ్రమలో అధికంగా వినిపిస్తున్న వివాదం అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకులు వ్యవహారం జాతీయ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. గత కొద్దికాలంగా టెలివిజన్ సీరియల్‌లా సాగుతున్న ఈ వ్యవహారంపై అభిషేక్ బచ్చన్ స్పందించారు. ఆయన తన దాంపత్య జీవితానికి సంబంధించి విడాకుల విషయానికి వస్తే..
గత రెండేళ్లుగా అంటే.. 2024 సంవత్సరం నుంచి అభిషేక్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఎన్నడూ కూడా వారిద్దరూ ఖండించకపోవడంతో ఈ రూమర్‌పై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. మీడియాలో ఏదో ఒక రూపంలో వారిద్దరి బ్రేకప్ గురించి కథనాలు వినిపించాయి. అయితే తాజాగా అభిషేక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఐశ్వర్యరాయ్‌కి సినిమా ఇండస్ట్రీ అంటే అమితమైన గౌరవం ఉంది. ఆరాధ్యకు అలాంటి గొప్ప విషయాన్ని చెబుతూనే ఉంటుంది. ప్రేక్షకులు మాకు ఇచ్చే గౌరవం వల్లే ఆరాధ్యకు చెబుతూనే ఉంటుంది. అలాంటి విషయాల వల్లే ఆరాధ్యకు డైవోర్స్ రూమర్స్ గురించి అవగాహన ఏర్పడింది. అయితే ఇలాంటి వార్తల గురించి నా కూతురు అర్ధం చేసుకొంటుంది. ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నది అని అభిషేక్ అన్నారు.
నా కూతురు ఆరాధ్యకు ఫోన్ వాడటం తెలియదు. ఆమెకు ఫోన్ లేదు. ఎవరైనా ఆమెతో మాట్లాడాలని అనుకొంటే ఆమె తల్లికి కాల్ చేస్తారు. అయితే ఆమెకు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. కానీ ఆమె హోంవర్క్ చేసుకోవడానికి ఉపయోగించుకొంటుంది. అంతేకానీ ఆమె బాలీవుడ్ రూమర్ల గురించి పట్టించుకోదు అని అభిషేక్ అన్నాడు.
నాకు, ఐశ్వర్య రాయ్‌కి మధ్య విభేదాలు, డైవోర్స్ విషయాలను పట్టించుకోదు. ఆమెకు అలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. మా మధ్య విభేధాలు ఉన్నాయనే విషయాన్ని ఆమె నమ్మదు. ఆలాంటి వార్తలు చదివినా పట్టించుకోదు. నా తల్లిదండ్రుల మాదిరిగానే నా కూతురు కూడా నా కుటుంబం విషయంలో నాకు సపోర్టుగా ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఆమెకు గౌరవం, తల్లిదండ్రులంటే ఇంకా ఇష్టం అని అభిషేక్ అన్నారు.


Click it and Unblock the Notifications











