twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాన్సర్‌తో యువ నటి మృతి.. మృత్యుశయ్యపై ఉన్నా అంటూ.. 29 ఏళ్లకే..!

    |

    సినీ నటి, మోడల్ దివ్య చౌక్సీ మరణించడంతో బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకొన్నది. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణాన్ని స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ధృవీకరించారు. దివ్య చౌక్సీ గురించి వివరాల్లోకి వెళితే..

     కంటతడి పెట్టించేలా మెసేజ్

    కంటతడి పెట్టించేలా మెసేజ్

    కొద్దిరోజుల క్రితం తన ఇన్సాటాగ్రామ్‌లో దివ్య పోస్టు చేసిన ఓ మెసేజ్ అందర్నీ కంటతడి పెట్టించేలా చేసింది. నా సన్నిహితులందరీ నమస్కారం. అనారోగ్యంతో నేను హాస్పిటల్‌లో చేరాను. కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు. నన్ను క్యాన్సర్ ప్రతీ క్షణం చంపేస్తున్నది. ఎలాంటి బాధలు లేకుండా నన్ను ఈ లోకం వీడేలా ప్రార్థించండి. మీకు ఇక సమాధానం ఇవ్వలేకపోవచ్చు. నన్ను ప్రేమించి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఆమె తన పోస్టులోపేర్కొన్నారు.

    మరణశయ్యపై ఉన్నానంటూ

    మరణశయ్యపై ఉన్నానంటూ

    మరికొద్ది రోజుల తర్వాత మరోసారి ఇన్స్‌టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్టు పెట్టారు. ప్రస్తుతం నేను మరణశయ్యపై ఉన్నాను. నాకే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. విధి నన్ను వెంటాడుతున్నా నేను మానసికంగా బలంగా ఉన్నాను. ఇలాంటి బాధలు లేని మరో జీవితం ఉంటుందనే ఆశాభావంతో ఉన్నాను. అలాంటి ఉంటుందో లేదో దేవుడికే తెలియాలి అని దివ్య తన మెసేజ్‌లో పేర్కొన్నారు.

    దివ్య మృతి గురించి

    దివ్య మృతి గురించి

    దివ్య మృతి గురించి ఆమె కజిన్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. నా కజిన్ దివ్య ఇక లేరనే విషయాన్ని తెలియజేయడానికి చాలా దు:ఖిస్తున్నాను. క్యాన్సర్ కారణంగా చిన్న వయసులోనే మరణించడం బాధకరం అని పోస్ట్ చేశారు. దివ్య మృతికి టీవీ నటుడు సాహిల్ ఆనంద్, ఇతర నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

    Recommended Video

    Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
    దివ్య యాక్టింగ్ కెరీర్

    దివ్య యాక్టింగ్ కెరీర్

    పలు టెలివిజన్ సీరియల్స్‌లో అద్భుతమైన ప్రతిభను చాటిన దివ్య చౌక్సీ హిందీ ప్రేక్షకులందరికీ సుపరిచితులు. నటిగానే కాకుండా పలు వ్యాపార ప్రకటనల్లో నటించారు. హై అప్పా దిల్ తో ఆవారా అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. 2018లో పాటియాలే ది క్వీన్ అంటూ సింగర్‌గా మారారు. ఆమె లండన్‌లో యాకింగ్‌లో శిక్షణ పొందారు.

    English summary
    Actress Divvya Chouksey died with cancer at 29 years. She was suffering with cancer for two years. She debuted in bollywood with Hai Apna Dil Toh Awara in 2016, Divvya breathed her last in her hometown Bhopal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X