దివ్యభారతి డెత్ మిస్టరీ: సూసైడా? మర్డరా?... చెప్పలేనని తండ్రి ఆవేదన

అందాల నటి దివ్య భారతి మరణం కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల తార మరణం ఓ మిస్టరీగా మారింది. అయితే ఆమె మరణం తర్వాత బాలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాతపై పలు అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. అయితే వాటిని లోతుగా పరిశోధించకుండానే కనుమరుగైపోయాయి. తాజాగా ఫిబ్రవరి 25న ఆమె జన్మదినం సందర్భంగా ఆంగ్ల వెబ్‌సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ వార్తలో అనేక అనుమానాలు మరోసారి కనిపించాయి. తండ్రి చెప్పిన విషయాలు మరింత గందరగోళంగా మారాయి. అవేమిటంటే..

కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా

కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా

దివ్యభారతి అనతికాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్రతారగా మారింది. స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తన మార్కును ప్రదర్శిస్తున్న సమయంలో ప్రముఖ నిర్మాతతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. కొద్దిరోజులు వారిద్దరూ కలిసి తిరిగినట్టు మీడియా కూడా గుర్తించింది.

 నిర్మాతతో ప్రేమలో పడి

నిర్మాతతో ప్రేమలో పడి

అయితే ప్రముఖ నిర్మాతతో వ్యకిగత విభేదాలు రావడంతో దివ్యభారతి కొంత మానసిక రుగ్మతకు గురైనట్టు వార్తలు వచ్చాయి. నిర్మాత వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సమయంలో ముంబైలో 1993, ఏప్రిల్ 5వ తేదీన ఐదంతస్తుల భవనంపై నుంచి పడి మరణించారు.

మరణానికి ముందు పార్టీలో

మరణానికి ముందు పార్టీలో

తన మరణానికి ముందు డిజైనర్ నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ లుల్లాతో పార్టీ చేసుకొన్నది. పార్టీ జరుగుతున్న సమయంలోనే పిట్టగోడ మీద నుంచి కిందకు పడిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవి నమ్మశక్యంగా లేవు అంటూ కొన్ని వర్గాలు అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు.

సూసైడా? మర్డరా? చెప్పలేనని

సూసైడా? మర్డరా? చెప్పలేనని

దివ్యభారతి మరణం తర్వాత తండ్రి ఓం భారతి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు. నా కూతురు సూసైడ్? మర్డరా? అనే విషయాన్ని చెప్పలేను. నా కూతురు మరణానికి ముందు అతిగా మద్యం సేవించలేదు. దివ్యభారతి ధృడమైన మనస్తత్వం, నా కూతురు మరణం ఓ యాక్సిడెంట్‌లా జరిగిపోయింది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X