For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దివ్యభారతి మృతిలో కొత్త కోణం.. మరణానికి ముందు చివరి క్షణాలు.. ఏం జరిగిందంటే?

  |

  అందాల నటి దివ్య భారతి దేశ సినీ పరిశ్రమలోనే అత్యంత గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నది. చిన్నతనంలోనే అగ్ర హీరోయిన్లకు ధీటుగా క్రేజ్‌ను సంపాదించుకొన్నది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్రహీరోలతో జతకట్టింది. దురదృష్టవశాత్తు విధి ఆమె జీవితాన్ని కబలించింది. 19 ఏళ్ల వయసులోనే మృత్యు ఒడికి చేరుకొన్నది. దివ్యభారతీ జన్మదినం ఫిబ్రవరి 25. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కథనం జాతీయ మీడియాలో వెలుగుచూసింది. ఆమె మరణానికి ముందు ఏం చేశారనే విషయం వైరల్‌గా మారింది. మరణానికి కొద్ది గంటల ముందు ఏం జరిగిందంటే..

  చెన్నైలో షూటింగ్ ముగించుకొని

  చెన్నైలో షూటింగ్ ముగించుకొని

  చెన్నైలో షూటింగ్ ముగించుకొని ముంబైలోని తన నివాసానికి చేరుకొన్నది. ఆ సమయంలోనే మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటే దానిని క్యాన్సిల్ చేసుకొన్నది. ఆ తర్వాత డిజైనర్ నీతా లుల్లా నుంచి ఫోన్ కాల్ రావడంతో ఆమెను ఇంటికి ఆహ్వానించింది. తన భర్తతో కలిసి వచ్చిన నీతాతో ఆందోళన్ అనే సినిమా కోసం తన దుస్తుల డిజైనింగ్ గురించి చర్చించింది అని కథనంలో పేర్కొన్నారు.

  డిజైనర్‌తో కలిసి మందు పార్టీలో

  డిజైనర్‌తో కలిసి మందు పార్టీలో

  నీతా, ఆమె భర్త, సైక్రియాటిస్ట్ శ్యామ్ లుల్లాతో కలిసి ఆ తర్వాత మందుపార్టీని జరుపుకొన్నారు. ఎంజాయ్ చేస్తూ మద్యం సేవిస్తున్నారు. ఓ పక్క వంటమనిషి తినడానికి స్నాక్ చేస్తున్నారు. మద్యం సేవిస్తూ నీతా దంపతులు టెలివిజన్ చూస్తుండగా.. దివ్య బాల్కనీలోకి వెళ్లి గోడ చివరన కూర్చున్నది. అక్కడ అదుపు తప్పడంతో కింద పడిపోయింది అని కథనంలో వెల్లడించారు.

  ఐదో అంతస్థు నుంచి కిందపడటంతో

  ఐదో అంతస్థు నుంచి కిందపడటంతో

  తన నివాసంలోని ఐదో అంతస్థు నుంచి కిందకు పడిపోవడంతో దివ్యభారతికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. వైద్యులు వచ్చే సరికి ఊపిరితోనే ఉన్నారు. గాయలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు అని ఆంగ్ల వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది.

  దివ్యభారతి తండ్రి ఏమన్నారంటే

  దివ్యభారతి తండ్రి ఏమన్నారంటే

  దివ్య భారతి మరణంపై రకరకాల అనుమానాలు, ఊహాగానాలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ మ్యాగజైన్‌తో దివ్యభారతి తండ్రి మాట్లాడుతూ.. నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఆమెది సూసైడ్ లేదా మర్డర్ అని చెప్పలేను. అలాగా అని అతి మద్యం సేవించను లేదు. అర్ధగంటలో ఎంత తాగుతాం చెప్పండి అని ఆవేదన వ్యక్తం చేశారు.

  దివ్యభారతికి డిప్రెషన్ లేదని

  దివ్యభారతికి డిప్రెషన్ లేదని

  దివ్యభారతి ఎలాంటి మానసిక సంఘర్షణకు గురి కాలేదు. ఎలాంటి సమస్యనైనా కూల్‌గా పరిష్కరించుకొనేంది. అవసరమైతే ఎదుటి వాళ్లకే చుక్కలు చూపించే ధృఢమైన మనస్తత్వం అని దివ్యభారతి తండ్రి ఓం భారతీ అన్నారు. దివ్యభారతి మరణం ఓ ప్రమాదంలా జరిగిపోయింది. పిట్టగోడ మీద కూర్చొని బ్యాలెన్స్ తప్పి పడిపోయిందని చెప్పారు.

  దివ్యభారతి ఇంటికే గ్రిల్స్ లేవు

  దివ్యభారతి ఇంటికే గ్రిల్స్ లేవు

  దివ్యభారతి ఉండే అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్లకు గ్రిల్స్ ఉండేవి. ఏం దురదృష్టమో కానీ ఆమె ఫ్లాట్‌కే గ్రిల్ లేవు. ప్రతీ రోజు కింద కార్లు పార్కు చేసి ఉంచే వారు. ఆ రోజే ఒక్క కారు కూడా పార్క్ చేసి లేదు. ఐదో అంతస్థు నుంచి నేరుగా నేల మీద పడిపోయింది. ఆమె మరణం మమల్ని తీరని విషాదంలోకి నెట్టింది. దివ్య భారతి లేదనే విషయాన్నిజీర్ణించుకోలేకపోతున్నాం అని తండ్రి ఓం భారతీ బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు.

  English summary
  On Divya Bharti's 45th birth anniversary today, we take a look at how she spent the last few hours of her life before falling to her death from the balcony of her fifth floor apartment. Divya's father Om Bharti told a magazine that he did not suspect any foul play. "There was no question of suicide or murder.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X