లెజెండరీ క్రికెటర్‌తో సహజీవనం.. పెళ్లికాకుండానే తల్లైన హీరోయిన్ తెలుసా?
సినీ, క్రికెట్ రంగాలకు విడదీలేని అనుబంధం ఉంటుంది. రెండు రంగాలకు చెందిన వారు ఒకరితో మరొకరికి అవినాభావ బంధాలు ఉంటాయి. అయితే క్రికెటర్లు సీనీ తారలతో కలిసి యాడ్స్, ఈవెంట్లలో కలుసుకోవడం వల్ల వారి మధ్య పరిచయాలు ఏర్పడి.. ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లిగా కూడా మారిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఓ లెజెండరీ క్రికెటర్‌తో స్టార్ హీరోయిన్ సహజీవనం, పెళ్లి కాకుండానే తల్లిగా మారిన విషయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారతీయ సినీ, క్రికెట్ రంగాల మధ్య ప్రేమలు, పెళ్లిళ్లు ఇప్పటివి కావు.. దాదాపు 5, 6 దశాబ్దాల క్రితం నాటివే. అప్పట్లో క్రికెటర్ పటౌడీ, హీరోయిన్ షర్మిలా టాగోర్ (ప్రస్తుత సైఫ్ ఆలీఖాన్ తల్లిదండ్రులు) ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వరకు చాలా సంఘటనలు ఉన్నాయి.

అయితే ఆ మధ్యలో రాయ్ లక్ష్మీ, దీపికలతో ధోని అఫైర్ వార్తలు బయటకు వచ్చాయి. కానీ అవి పెళ్లి వరకు వెళ్లలేదు. అయితే 80 దశకంలో క్రికెట్‌ను శాసించిన స్టార్ బ్యాట్స్‌మెన్ వివియన్ రిచర్డ్స్ ఇండియాలో పర్యటించిన సమయంలో నీనా గుప్తాతో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ సహజీవనంగా మారడంతో వారిద్దరూ కలిసి మెలిసి జీవించారు.
వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తా మధ్య సహజీవనం ఫలితంగా వారికి ఓ కూతురు కలిగింది. ఆ కూతురే బాలీవుడ్‌లో రాణిస్తున్న నటి, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. అయితే చాలా కాలం రిచర్డ్స్, నీనా తమ అనధికారిక దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వారిద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోయారు.
రిచర్డ్‌కు అప్పటికే పెళ్లి అవ్వడం వల్ల తన దారి తాను చూసుకొన్నాడు. కానీ మసాబా గుప్తాను సింగిల్ పేరెంట్‌గా ఆలనా పాలన చూశారు. తన కూతురు కోసం వేరే పెళ్లికి దూరంగా ఉన్నారు. కూతురు పెద్ద పెరిగి తన పెళ్లి జరిగేంత వరకు ఒంటరిగానే ఉన్నారు. ఆ తర్వాత మరో వివాహం చేసుకొన్నారు.
నీనా గుప్తా విషయానికి వస్తే.. తొలుత స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే అమ్లాన్ కుసుమ్ ఘోష్‌ను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత ఏడాదికే విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వా పండిట్ జస్రాజ్ కొడుకు షారంగదేవ్ పండిట్‌తో రిలేషన్‌షిప్ కొనసాగించారు. అతడితో విడిపోయిన తర్వాత రిచర్డ్స్‌తో సహజీవనం చేశారు. ప్రస్తుతం ఢిల్లీకి చెందిన ఛార్టెట్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకొని దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











