చట్టాన్ని అతిక్రమించి రెండుసార్లు జైలుకెళ్లిన స్టార్ హీరో.. నేషనల్ అవార్డులు, పద్మశ్రీ అందుకొన్న ఆ నటుడు ఎవరో

కోట్లాది మంది అభిమానులు ఉన్న సినీ తారలు కూడా సాధారణ మనుషులే. తప్పులు చేయకుండా ఉండలేరు. అలాంటి ప్రేక్షకాదరణ ఉన్న సినీ తారలు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకొంటూ పోతుంది. చట్టాలను అతిక్రమించిన సినీతారలు ఎందరో కటకటాల వెనుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే లైసెన్స్ లేకుండా గన్ ఉపయోగించి.. అలా తప్పు చేసి రెండుసార్లు జైలుకెళ్లిన సీనియర్ హీరో గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అయితే మీరు అనుకొన్నట్టు సంజయ్ దత్ కాదు.. అయితే వివాదాలకు దూరంగా ఉండే ఆ హీరో ఎవరు? ఎలా జైలుకు వెళ్లారనే విషయంలోకి వెళితే...

బాలీవుడ్‌లో అజయ్ దేవగన్‌కు సింప్లీ సూపర్బ్ హీరో అనే పేరుతంది. పూల్ ఔర్ కాంటే సినిమాతో విశేషంగా పాపులారిటీని సంపాదించుకొన్న ఈ హీరో సింగమ్, భోలా, గోల్‌మాల్, దృశ్యం లాంటి సినిమాలతో మంచి నటుడిగా, కమర్షియల్ హీరోగా ఆకట్టుకొన్నారు. రెమ్యునరేషన్ పరంగా అగ్ర హీరోలతో పోటీ పడుతున్నాడు.

Ajay Devgan

అజయ్ దేవగన్ సినిమాలతో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా నేరుగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. నిర్మాతగా, దర్శకుడిగా తన సత్తాను చాటుతూ 100 కోట్ల రెమ్యునరేషన్ ఆశించే స్థాయికి ఎదిగాడు. కెరీర్ పరంగా ఎదుగుతూ పలు నేషనల్ అవార్డులు అందుకొన్నాడు. అలాగే ఆయన ప్రతిభకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

అజయ్ దేవగన్ నటించిన కానూన్, దిల్‌వాలే, జిగర్, ఇష్క్ లాంి సినిమా అద్బుతమైన విజయాలు అందుకొన్నాయి. తొలుత జకమ్ అనే సినిమాకు ఓ సారి నేషనల్ అవార్డు, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, హమ్ దిల్ దే చుకే సనమ్, తానాజీ సినిమాకు రెండోసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అజయ్ దేవన్ సొంతం చేసుకొన్నారు.

ఇటీవల తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలు అజయ్ దేవగన్ బాలీవుడ్ మీడియాతో పంచుకొన్నారు. చిన్నతనంలో తాను చట్టాలు, మీడియాను, ఎవరినీ లెక్క చేసే వాడిని కాదు. నా ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్లకు చాలా చికాకులు తెచ్చి పెట్టేవాడిని అని చెప్పారు. మా నాన్న వీరు దేవగన్ (యాక్షన్ డైరెక్టర్) పిస్టోల్‌ను, గన్‌ను లైసెన్స్ లేకుండా బయటకు తీసుకెళ్లిందుకు రెండుసార్లు జైల్లో పెట్టారు అని చెప్పారు.

అజయ్ దేవగన్‌ కెరీర్ విషయానికి వస్తే.. 2022 సంవత్సరంలో RRR, రన్‌వే 34, థ్యాంక్ గాడ్, దృశ్యం 2 చిత్రాల్లో నటించాడు. 2023లో భోళా సినిమాలో నటించాడు. ఆయన నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే. సింగమ్ అగైన్, ఆరోన్ మే కహ దమ్ థా, యూనైటెడ్ వష్ రీమేక్, మైదాన్ సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X